ట్రెండ్ అవుతున్న సరిలేరు నీకెవ్వరు సాంగ్.. బన్నీని వెనక్కి నెట్టి!
సూపర్ స్టార్ మహేష్ బాబు మండే సర్‌ప్రైజ్ అదిరింది. మొదటి మండే మైండ్ బ్లాక్ చేసిన మహేష్.. రెండో మండే ట్రెండ్ అవుతున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి విడుదలైన రెండో పాట ''సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో...'' యు ట్యూబ్ ట్రెండింగ్ లిస్టులో టాప్ స్థానంలో నిలిచింది. అదేవిధంగా దీంతో పాటే విడుదలైన 'అల.. వైకుంఠపురములో' టీజర్ గ్లింప్స్ రెండో స్థానంలో ఉంది.
''సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో...'' అంటూ సాగిపోతున్న సరిలేరు నీకెవ్వరు సెకండ్ సాంగ్ లిరిక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్‌పై దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఫ్రెష్ మెలోడీ ట్యూన్స్ క్లాస్, మాస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాట హంగామానే కనిపిస్తోంది.

ఇప్పటి వరకు విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' అప్‌డేట్స్ చూస్తుంటే ఈ సినిమా మహేష్ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలుస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా కామెడీ సన్నివేశాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయింది.
ఇక 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతోనే వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











