Don't Miss!
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్‌లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్ బాబు గురించి వీవీఎస్ లక్ష్మణ్.. సూపర్ స్టార్ రియాక్షన్
చాలా రోజుల తర్వాత మహర్షి సినిమా చూసిన వీవీఎస్ లక్ష్మణ్.. మహేష్ బాబు పై పొగడ్తల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తనను, చిత్ర బృందాన్ని పొగుడుతూ లక్ష్మణ్ చేసిన ట్వీట్ పై స్పందించాడు మహేష్ బాబు. ఈ మేరకు ఆయనకు ధన్యవాదాలు చెబుతూ.. మీ ప్రశంస పొందటం ఆనందంగా ఉందని తెలిపారు మహేష్ బాబు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది 'మహర్షి' సినిమా. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇందులో మహేశ్ సరసన పూజా హెగ్డే నటించగా, అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో కనిపించాడు. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో, రైతు నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకొని కాసుల పంట పండించింది. గతంలోనే ఎంతో మంది సెలెబ్రిటీలు మహర్షి అందించిన మెసేజ్‌పై స్పందించారు.
Thank you very much @VVSLaxman281 sir. Glad you liked our film :)
— Mahesh Babu (@urstrulyMahesh) July 23, 2019
అయితే ఇటీవలే ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో కామెంటేటర్‌గా బిజీగా ఉన్న హైదరాబాదీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్.. ఇంగ్లండ్ నుంచి తిరిగిరాగానే మహర్షి సినిమా చూశారు. సినిమా బాగా నచ్చడంతో వెంటనే మహేష్ బాబును, చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ పెట్టాడు. లక్ష్మణ్- మహేష్ బాబు ట్వీట్స్ చూసి సినీ, క్రీడాభిమానులు ఖుషీ అవుతూ లైకుల వర్షం కురిపిస్తున్నారు.