Don't Miss!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్‌కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
మహేష్ బాబు ఐడియా అదిరింది.. టాప్ రెమ్మ్యూనరేషన్ అందుకోవడంలో సరిలేరు ఆయనకెవ్వరూ..
తెలుగు చిత్రసీమలో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజే వేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్నిరకాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సినిమాలు తీసి సక్సెస్ అవుతుంటారు మహేష్. అందుకే తండ్రి లక్షణాలు అందిపుచ్చుకుంటూ తెలుగు తెరపై సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నాడు. సినిమా సినిమాకు సమంత క్రేజ్ పెంచేసుకున్న మహేష్.. ఇటీవలే 25 సినిమాలు పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రెమ్మ్యూనరేషన్కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. వివరాల్లోకి పోతే..
25 సినిమాలు పూర్తి చేసి.. 26వ సినిమా
దాదాపు రెండు దశాబ్దాల క్రింద కెరీర్ ప్రారంభించిన మహేష్ బాబు.. ఇప్పటిదాకా 25 సినిమాలు పూర్తిచేశాడు. తన 25 వ సినిమాగా మహర్షి రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్. అదే జోష్ లో ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 26వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్లో పాల్గొంటున్నాడు.
మహేష్ బాబు ఐడియా..
మహేష్ బాబు సినిమాల్లో లాగే, బిజినెస్‌మెన్‌గా కూడా సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు వ్యాపార రంగాల్లో అడుగుపెట్టిన మహేష్.. తన సినిమాలకు రెమ్మ్యూనరేషన్ తీసుకునే విషయంలోనూ ఓ ఐడియా వేశారు. ఈ నేపథ్యంలోనే రెమ్మ్యూనరేషన్ బదులుగా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను చేజిక్కించుకోవడం మొదలు పెట్టారట మహేష్.
మహర్షితో ప్రయోగం.. సక్సెస్
ఈ ఇదని ఇటీవలే వచ్చిన మహర్షి సినిమాతోనే ప్రయోగించారట మహేష్. మహర్షి నాన్ థియేట్రికల్ రైట్స్‌ను రెమ్యునరేషన్‌గా తీసుకోగా ఆయనకు 45 కోట్ల వరకు వచ్చాయని తెలుస్తోంది. శాటిలైట్‌తో పాటు డిజిటల్ స్ట్రీమింగ్, ఆడియో తదితర హక్కులన్నీ కలిపి ఈ మొత్తం మహేష్ ఖాతాకు చేరిందట. ఈ లెక్కన మహేష్ ఐడియా భేష్ అన్నట్లే.
'సరిలేరు నీకెవ్వరు'పై ఇంప్లిమెంట్
దీంతో ఇదే ఐడియాను తన 26 వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు'పై కూడా ప్రయోగిస్తున్నాడట మహేష్. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను మహేష్ రెమ్యునరేషన్‌గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రూపంలో మహేష్‌కు 52 కోట్ల రూపాయల మేర అండనున్నాయని సమాచారం. పైగా ఈ సినిమా నిర్మాణంలో కూడా మహేష్ భాగం పంచుకుంటున్నాడు. ఇదంతా చూస్తుంటే సరిలేరు మహేష్‌కెవ్వరూ కదూ!.
సరిలేరు నీకెవ్వరు మూవీ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ సినిమాగా రూపొందుతోంది 'సరిలేరు నీకెవ్వరు' మూవీ. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో మహేష్ సరసనరష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి ముఖ్యపాత్ర పోషిస్తోంది.