సరిలేరు నీకెవ్వరు సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ చూస్తే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్టుగా సరికొత్తగా అప్‌డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తూ వచ్చింది చిత్రయూనిట్.
ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తిచేసుకొని U/A సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఈ సర్టిఫికెట్‌లో 'సరిలేరు నీకెవ్వరు' రన్‌టైమ్ 169 నిమిషాలుగా పేర్కొన్నారు. అంటే 2 గంటల 49 నిమిషాలని అర్థం. హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా కాబట్టి దీన్నిబట్టి చూస్తే ఈ నిడివిలో ఎక్కువ భాగం కామెడీ ఎపిసోడ్స్‌కే ఉంటుందని స్పష్టమవుతోంది.
ఇక ఈ రన్‌టైమ్ చూసి 'పర్ఫెక్ట్ టైమ్' అంటూ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఏ మాత్రం ఎక్కువ, తక్కువ కాకుండా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాపై నెలకొన్న బజ్ కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. సీనియర్ హీరోయిన్ విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ట్రైన్ కామెడీ సీన్ హైలైట్ కానుందని తెలుస్తోంది. ఇందులో బండ్ల గణేష్ కామెడీ ఎపిసోడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని టాక్. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా జనవరి 11న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











