'సరిలేరు నీకెవ్వరు' బిగ్ అనౌన్స్‌మెంట్.. పోటీగా అల్లు అర్జున్ మూవీ! మెగా సర్‌ప్రైజ్ ఖాయమేనా?
మహేష్ బాబు తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది. ఇన్ని రోజులు మండే ట్రీట్స్ ఇస్తూ మహేష్ అభిమానుల్లో జోష్ నింపిన చిత్రయూనిట్ ఈ సారి శుక్రవారంపై కన్నేసింది. ఈ మేరకు నేడు (డిసెంబర్ 20)న సరిలేరు నీకెవ్వరు ల్యాండ్ మార్క్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని ప్రకటించారు. వివరాల్లోకి పోతే..

పోటీగా అల్లు అర్జున్ సినిమా.. బిగ్ అనౌన్స్‌మెంట్
వచ్చే సంక్రాంతికి బరిలోకి దిగేందుకు రెడీ అయింది 'సరిలేరు నీకెవ్వరు' సినిమా. పోటీగా అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' కూడా ఉండటంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అప్‌డేట్స్ ఇస్తోంది మహేష్ బాబు టీం. ఈ మేరకు ఇప్పటికే పలు అప్‌డేట్స్ ప్రేక్షకుల ముందుంచిన చిత్రయూనిట్.. నేడు అన్నింటికంటే బిగ్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని ప్రకటించింది.

ముదిరిన చర్చ.. దాని గురించేనా?
శుక్రవారం సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు ఈ అనౌన్స్‌మెంట్ చేస్తామని తెలపడంతో మహేష్ అభిమానుల్లో ఆత్రుత నెలకొంది. ఈ బిగ్ అనౌన్స్‌మెంట్ జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఆ బిగ్ అనౌన్స్‌మెంట్ ట్రైలర్ గురించా? లేక ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గురించా? అనే చర్చ ముదిరింది.

జనవరి 5వ తేదీ ఆదివారం సాయంత్రం
జనవరి 5వ తేదీ ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ వేడుక జరగనుందని చిత్ర యూనిట్
ఇప్పటికే తెలియజేసింది. ఈ వేడుకలో తారల సందడి మిన్నంటేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది.

మెగా ఫ్యామిలీ రంగంలోకి దించనున్న మహేష్..
మహేష్ గత చిత్రాలైన ‘భరత్ అనే నేను' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీఆర్, ‘మహర్షి' సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వెంకటేష్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు విచ్చేశారు. ఇక ఈసారి కూడా అదే బాటలో మెగాస్టార్ చిరంజీవిని గానీ, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌ను గానీ ఈ వేడుకకు రప్పించాలనే కోణంలో వారిరువురికి ఆహ్వానించినట్లు టాక్ వచ్చింది.

మెగా సర్‌ప్రైజ్ ఖాయమేనా?
దీంతో ఈ బిగ్ అనౌన్స్‌మెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గురించే అని చెప్పుకుంటున్నారు జనం. అయితే మరోవైపు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు పోటీగా అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమా దిగుతున్న నేపథ్యంలో మెగా హీరోలు మహేష్ ఈవెంట్‌కి రావడం సాధ్యమేనా? మెగా సర్‌ప్రైజ్ ఖాయమేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

'సరిలేరు నీకెవ్వరు' మూవీ
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' రూపొందింది. చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటించింది. విజయశాంతి కీలక పాత్ర పోషించింది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











