దుష్టశక్తిని సంహరించు.. సరిలేరు నీకెవ్వరు పోస్టరుపై మహేష్ కేక
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్లతో దూసుకెళ్తూ.. రాజాది గ్రేట్, F2 వరుస సక్సెస్‌లను సొంతం చేసుకొన్న అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు చిత్రం కోసం జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్‌టైన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రంలో రష్మిక మందన్న, అదితీ రావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఫ్యాన్స్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రం నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. దసరా పండుగను పురస్కరించుకొని మహేష్ ఫ్యాన్స్‌కు మరో కానుకను నిర్మాత అనిల్ సుంకర అందజేశారు. అదేమిటంటే..
దుష్టశక్తిని సంహరించు.. విజయదశమిని గర్వంగా వేడుకగా జరుపుకోవాలి అని మహేష్ బాబు తన సినిమా పోస్టర్‌తోపాటు దసరా శుభాకాంక్షలు ట్వీట్ ద్వారా తెలియజేశారు.
ఈ సినిమా కోసం కర్నూలు జిల్లాకే తలమానికంగా మారిన కొండారెడ్డి బురుజు సెట్‌ను రామోజీ ఫిలిం సిటీలో వేశారు. ఆ సెట్‌కు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. నిజంగా కొండారెడ్డి బురుజా అనే ఫీలింగ్‌ను కలిగించేలా సెట్ ఉండటంతో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.
నటీనటులు:
సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబుతోపాటు విజయశాంతి, రష్మిక మందన్న, ప్రకాశ్ రాజ్, నరేష్, సంగీత, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్, ప్రదీప్ రావత్, రోహిణి, వెన్నెల కిషోర్, పవిత్ర లోకేష్, బ్రహ్మనందం, కిరీటీ దామరాజు, సచిన్ ఖేడ్కర్, అనసూయ భరద్వాజ్, ఆది పినిశెట్టి, సత్య రాజేష్, తమన్నా, పూజా హెగ్డే (ఐటెమ్ నంబర్)
కథ, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫి: ఆర్ రత్నవేలు
బ్యానర్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
రిలీజ్: జనవరి 10, 2020


Click it and Unblock the Notifications











