మహేష్ బాబు ఫ్యాన్స్‌కు దీపావళీ గిఫ్ట్.. క్రేజీ పోస్టర్ రిలీజ్
భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్లతో దూసుకెళ్తున్న సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, రాజాది గ్రేట్, F2 వరుస సక్సెస్‌లను సొంతం చేసుకొన్న అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్‌టైన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో రష్మిక మందన్న, అదితీ రావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీపావళీ పండుగను పురస్కరించుకొని ప్రిన్స్ మహేష్ బాబు లుక్‌ను రిలీజ్ చేశారు. మహేష్ బాబు బైక్‌పై వెళ్తున్న ఫొటోను అభిమానులకు అందించారు.

మా దీపావళీ పండుగ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. సరిలేరు నీకెవ్వరు దీవాళీ పోస్టర్ మీకోసం. ఈ సినిమా జనవరి 12న విడుదల కానున్నది అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా శనివారం ఉదయం విజయశాంతి లుక్‌ను రిలీజ్ చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఫ్యాన్స్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు అదిరిపోయే కానుక ఇచ్చారు. ఆయన నటించిన 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రం నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్‌ను సైనికులకు డెడికేట్ చేస్తూ సైనికుడిగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. ఇలా ఎన్నో విశేషాలతో తెరకెక్కుతున్న చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీలో కళ్లు చెదిరే సెట్ వేశారు.


Click it and Unblock the Notifications











