మహేష్ బాబు సరికొత్త రికార్డ్.. ఇండియన్ సినిమాల్లో కెల్లా టాప్! 'సరిలేరు' ఇంకెవ్వరూ

తెలుగోడి సత్తా ప్రపంచానికి తెలియజేసింది 'బాహుబలి' సినిమా. ఈ సినిమా తర్వాత దేశ, విదేశాల కన్ను టాలీవుడ్ ఇండస్ట్రీపై పడిందనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు సినిమాలను ఇతర భాషల్లో సైతం రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు దర్శకనిర్మాతలు. ఇక స్టార్ హీరోల సినిమాలకైతే విడుదలకు ముందే భారీ క్రేజ్ ఏర్పడుతుండటం తెలుగు చిత్రసీమలో నూతనోత్సాహం నింపుతోంది. ఈ కోవలోనే సూపర్ స్టార్‌ మహేష్ బాబు తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' పలు రికార్డులను తిరగరాస్తోంది.

ఆర్మీ మేజర్ మహేష్.. భారీ డిమాండ్

ఆర్మీ మేజర్ మహేష్.. భారీ డిమాండ్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ రోల్ పోషిస్తున్నారు. చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి నింపడమే గాక సినిమాకు భారీ డిమాండ్ క్రియేట్ చేశాయి.

సరిలేరు అనేలా టీజర్ సెన్సేషన్

సరిలేరు అనేలా టీజర్ సెన్సేషన్

వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న మహేష్.. టాలీవుడ్‌లో టాప్‌ హీరోగా కీర్తించబడుతున్నారు. కాబట్టి ఆయన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'పై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ క్రమంలో ఇటీవలే విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' టీజర్‌ ఆన్‌లైన్‌లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. సౌత్‌లో తొలి 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్‌గా ఆల్‌టైం రికార్డ్‌ నమోదు చేసింది ఈ టీజర్.

ఇండియన్ సినిమాల్లో కెల్లా మహేష్ సినిమానే టాప్

ఇండియన్ సినిమాల్లో కెల్లా మహేష్ సినిమానే టాప్

ఈ నేపథ్యంలోనే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తాజాగా మరో ఫీట్ సాధించింది. ఆన్‌లైన్ మూవీ అనాలిటికల్ సంస్థ IMDb సంస్థ రేటింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతున్న సినిమా గురించి అధ్యయనం చేస్తూ.. ఏ సినిమాకు ఎంత డిమాండ్ ఉందనేది అంచనా వేస్తుంది ఈ సంస్థ. తాజాగా ఈ సంస్థ అందించిన రిపోర్ట్ మేరకు ఇండియన్ సినిమాల్లో కెల్లా సరిలేరు నీకెవ్వరు సినిమానే టాప్ పొజిషన్ లో నిలిచింది.

బాలీవుడ్ బడా సినిమాలను సైతం పక్కనబెట్టి

IMDb సంస్థ నివేదిక ప్రకారం.. విడుదలకు ముందస్తుగా రియల్ టైమ్ పాపులారిటీ సంపాదించిన ఇండియన్ సినిమాల్లో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా 41.5 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా దబాంగ్ 3, పానిపట్ చిత్రాలు నిలవడం విశేషం. దీన్ని బట్టి ఇండియా లెవెల్‌లో మహేష్ సినిమాకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

Recommended Video

#CineBox : Allu Arjun Is taking Huge Remuneration For Trivikram Srinivas's 'Ala Vaikuntapuramlo'?
మహేష్.. సరిలేరు నీకెవ్వరు

మహేష్.. సరిలేరు నీకెవ్వరు

విడుదలకు ముందే 'సరిలేరు నీకెవ్వరు' సెన్సషన్స్ చూసి తెగ సంబరపడుతోంది చిత్రయూనిట్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రికార్డులకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ ''మా దగ్గర బేరాల్లేవమ్మా'' అని డైరెక్ట్‌గా చెప్పేస్తోంది. సో ఈ లెక్కన చూస్తే ఈ సంక్రాంతికి మహేష్ హంగామా మామూలుగా ఉండదని స్పష్టంగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X