Don't Miss!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు శుభవార్త.. దీపావళీ రోజున సరిలేరు నీకెవ్వరు..
దీపావళీ పండుగ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు శుభవార్త. సంక్రాంతి బరిలో దూకనున్న సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్‌ను దీపావళీ రోజున అందించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓప్రకటన చేయడంతో వైరల్‌గా మారింది. ఈ టీజర్‌ను ఎప్పుడెప్పుడు చూడాలని అనిపిస్తున్నదని అభిమానులతోపాటు హీరోయిన్ రష్మిక మందన్న ట్వీట్ చేసింది.
మహేష్ బాబు క్రేజ్‌ను, అనిల్ రావిపూడి స్టయిల్లో సరిలేరు నీకెవ్వరూ టీజర్ ఉండబోతుందనే విషయం స్పష్టమవుతున్నది. ఇక ఈ టీజర్ గురించి రష్మిక అప్డేట్ ఇస్తూ.. దీపావళీ ట్రీట్‌కు సిద్దంగా ఉన్నారా? మీ కోసం స్పెషల్‌గా సిద్ధమవుతున్నది. మీరంతా ఆ ప్రత్యేకమైన దాని కోసం వేచి చూడండి అంటూ ట్వీట్ చేసింది.
మహేష్ బాబు, రష్మిక మందన్నతోపాటు విజయశాంతి చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమా ద్వారా టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, ప్రకాశ్ రాజ్, నరేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, బ్రహ్మనందం, వెన్నెల కిషోర్, ప్రదీప్ రావత్ నటిస్తున్నారు. సినిమాటోగ్రఫి: ఆర్ రత్నవేలు, ఎడిటింగ్: తమ్మిరాజు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.