twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు శుభవార్త.. దీపావళీ రోజున సరిలేరు నీకెవ్వరు..

    |

    దీపావళీ పండుగ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు శుభవార్త. సంక్రాంతి బరిలో దూకనున్న సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్‌ను దీపావళీ రోజున అందించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓప్రకటన చేయడంతో వైరల్‌గా మారింది. ఈ టీజర్‌‌ను ఎప్పుడెప్పుడు చూడాలని అనిపిస్తున్నదని అభిమానులతోపాటు హీరోయిన్ రష్మిక మందన్న ట్వీట్ చేసింది.

    మహేష్ బాబు క్రేజ్‌ను, అనిల్ రావిపూడి స్టయిల్‌లో సరిలేరు నీకెవ్వరూ టీజర్ ఉండబోతుందనే విషయం స్పష్టమవుతున్నది. ఇక ఈ టీజర్ గురించి రష్మిక అప్‌డేట్ ఇస్తూ.. దీపావళీ ట్రీట్‌కు సిద్దంగా ఉన్నారా? మీ కోసం స్పెషల్‌గా సిద్ధమవుతున్నది. మీరంతా ఆ ప్రత్యేకమైన దాని కోసం వేచి చూడండి అంటూ ట్వీట్ చేసింది.

    Mahesh babus Sarileru Neekevvaru teaser on deepawali

    మహేష్ బాబు, రష్మిక మందన్నతోపాటు విజయశాంతి చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, ప్రకాశ్ రాజ్, నరేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, బ్రహ్మనందం, వెన్నెల కిషోర్, ప్రదీప్ రావత్ నటిస్తున్నారు. సినిమాటోగ్రఫి: ఆర్ రత్నవేలు, ఎడిటింగ్: తమ్మిరాజు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

    English summary
    Mahesh babu and Anil Ravipudi latest movie is Sarileru Neekevvaru. This movie teaser to be released on Deepawali.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X