మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' డిమాండ్.. థియేట్రికల్ రైట్స్ ఎంత పలికాయంటే
వరుస సినిమాలు, అన్నీ సక్సెస్‌లు.. ఇలా మంచి జోష్‌లో ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన కెరీర్‌లో 25వ సినిమాగా వచ్చిన 'మహర్షి' రికార్డుల సునామీ సృష్టించడంతో 26వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' రెట్టింపు అంచనాలు నెలకొన్నాయి. అభిమానుల అంచనాలు రీచ్ అయ్యేలా భారీ హంగులతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి థియేట్రికల్ రైట్స్ ఎంత పలికాయనే విషయం కన్ఫర్మ్ అయింది. ఆ వివారాలు చూస్తే..

మహేష్‌పై భారీ హోప్స్.. హ్యూజ్ డిమాండ్
ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలపై అత్యంత నమ్మకంగా ఉన్నారు బయ్యర్స్. సూపర్ స్టార్ సినిమాతో సూపర్ డూపర్ బిజినెస్ ఖాయం అని భావిస్తూ ఆయన సినిమాలపై హ్యూజ్ డిమాండ్ క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలోనే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి.

పోటీ పడిన బయ్యర్స్ చివరకు
ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అప్పుడే ఈ సినిమా కోసం పోటీ పడిన బయ్యర్స్ చివరకు 75 కోట్ల రూపాయలు వెచ్చించి రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్నారని తెలిసింది. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇటీవలే ఇండిపెండెన్స్ డే కానుకగా
ఇటీవలే ఇండిపెండెన్స్ డే కానుకగా 'సరిలేరు నీకెవ్వరు' నుంచి అదిరిపోయే వీడియో రిలీజ్ చేసి మహేష్ అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది చిత్రయూనిట్. చిత్రంలో ఆర్మీ ఆఫీసర్‌గా మహేష్ బాబు నటిస్తున్న కారణంగా ఈ పాటకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఒకరకంగా ఈ సాంగ్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు.

విజయశాంతి, బండ్ల గణేష్ స్పెషల్ అట్రాక్షన్
ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి, కమెడియన్ బండ్ల గణేష్ భాగం కానుండటం మరో విశేషం. దాదాపు 15 ఏళ్ల తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం, మొన్నటి ఎన్నికల్లో హల్చల్ చేసిన బండ్ల గణేష్ వెండితెరపై దర్శనమీయనుండటం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

సరిలేరు నీకెవ్వరు మూవీ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబులు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











