సరిలేరు నీకెవ్వరు అప్‌డేట్.. కంప్లీట్ అంటూ డైరెక్టర్ ట్వీట్
భరత్ అనే నేను, మహర్షి లాంటి భారీ సక్సెస్‌ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఇటీవలే 'ఎఫ్ 2' సినిమాతో సంక్రాంతి సక్సెస్ సాధించిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ చెప్పారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.
'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిందని పేర్కొంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. 'సరిలేరు నీకెవ్వరు చిత్ర ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్‌లో పూర్తయింది. మహేష్ బాబుతో వర్క్ చేయడం అద్భుతంగా ఉంది. ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ మొదలవుతుంది. సెకండ్ షెడ్యూల్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నాను..' అని ట్వీట్‌లో పేర్కొన్నాడు అనిల్ రావిపూడి.

మహేష్ బాబు కెరీర్ లో 26 వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. చిత్రంలో మహేష్ బాబు సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి రేపుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.
సాధారణంగానే కామెడీ డోస్ అంటే ఇష్టపడే డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఈ సినిమాలో కామెడీ డోస్ మరింత ఆడ్ చేస్తున్నారట. మహేష్ బాబును హైలైట్ చేస్తూ వచ్చే కామెడీ సన్నివేశాలు గతంలో ఏ సినిమాలో చూడని విధంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారట డైరెక్టర్ అనిల్ రావిపూడి.


Click it and Unblock the Notifications











