Just In
Don't Miss!
- Finance
startup India seed fund: స్టార్టప్స్ కోసం రూ.1000 కోట్ల నిధి
- News
కామపిశాచి: 22ఏళ్లకే 11 పెళ్లిళ్లు -భార్య ముందే బాలికపై రేప్ -స్నేహితులతో సెక్స్‌కు ఒత్తిడి -లవ్లీ గణేశ్
- Sports
టీమిండియాను విమర్శించిన స్టార్క్ సతీమణి.. మతిభ్రమించిందంటూ మండిపడ్డ ఫ్యాన్స్!
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఈ రోజు రాత్రి ఇంట్లో పార్టీ.. మహేష్ బాబును రమ్మంటున్న తమన్నా.. ఫుల్ జోష్
సూపర్ స్టార్ మహేష్ బాబుతో పార్టీ చేసుకునేందుకు రెడీ అయింది తమన్నా. అంతేకాదు తన అందాలకు పదునుపెట్టి మహేష్ బాబుకు ''తూ ఆజానా'' అంటూ స్వాగతం పలికింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటి? మహేష్ బాబు, తమన్నా కలిసి న్యూ ఇయర్ పార్టీ చేసుకోబోతున్నారా? ఆ వివరాల్లోకి పోతే..

తమన్నా పార్టీ మూడ్.. డ్యాంగ్ డ్యాంగ్
మహేష్ బాబును పార్టీకి రమ్మంటూ తమన్నా ఆహ్వానం నిజమే కానీ ఇది రియల్ లైఫ్‌లో కాదు.. మహేష్ తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమాలోని డ్యాంగ్ డ్యాంగ్ పాటలో. ఇన్నాళ్లు మండే సర్‌ప్రైజ్‌లు ఇస్తూ దూసుకెళ్లిన చిత్రయూనిట్ తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలోని తమన్నా పార్టీ మూడ్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది.

తమన్నా అందాలు, మహేష్ బాబు దూకుడు
ఈ ప్రోమో సాంగ్‌లో తమన్నా అందాలు, మహేష్ బాబు స్టెప్పులు హుషారెత్తిస్తున్నాయి. డ్యాంగ్ డ్యాంగ్ అంటూ మరోసారి తన అందాలతో అందరికీ మత్తెక్కించింది మిల్కీ బ్యూటీ తమన్నా. నాజూకు నడుముతో ఆమె వేస్తున్న స్టైలిష్ స్టెప్స్ పాటకే హైలైట్ అయ్యాయి. ఇక ఈ పాటలో దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు సంగీత ప్రియులను కొత్త లోకంలోకి తీసుకెళ్లాయి.

సైనికుల మధ్య సాగే పాట..
ఈ పాట చూస్తుంటే మిలటరీ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. పార్టీ మూడ్‌లో ఉన్న సైనికుల మధ్య సాగే పాట ఇది. మహేష్ బాబు సహా పాటలో కనిపించిన అందరూ మిలిటరీ గెటప్స్‌లోనే కనిపించారు. మొత్తానికి తమన్నా చిందేసిన ఈ సాంగ్ థియేటర్లను హోరెత్తించడం ఖాయం అని తెలుస్తోంది.

ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోస్‌లో..
ఈ పాటను ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూట్ చేశారు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారు. ఇందులో తమన్నా అందాలతో పాటు మహేష్ డాన్సింగ్ మూమెంట్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఐటెం సాంగ్ అనిపించుకోకుండా ఓ డిఫెరెంట్ వేరియేషన్‌తో ఈ సాంగ్ సూపర్ టాక్ తెచ్చుకుంటోంది.
అనిల్ రావిపూడి టేకింగ్.. మహేష్ మ్యాజిక్
ఇక 'సరిలేరు నీకెవ్వరు' సినిమా విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతోనే వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తోంది. చిత్ర నిర్మాణంలో హీరో మహేష్ బాబు కూడా భాగమయ్యారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 11న విడుదల కానుంది.