Mahesh Babu: సర్కారు వారి పాట నుంచి సర్‌ప్రైజ్.. సర్జరీ జరిగినా షూటింగ్ ఆగకుండా ప్లాన్
కొంత కాలంగా యమ జోష్‌లో కనిపిస్తున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. దీనికి కారణం అతడు వరుస పెట్టి హిట్లు మీద హిట్లు కొడుతుండడమే. ఆ మధ్య పరాజయాలతో ఇబ్బందులు పడ్డ అతడు.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన కొరటాల శివ తెరకెక్కించిన 'భరత్ అనే నేను'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే మహేశ్ బాబు.. వంశీ పైడిపల్లితో 'మహర్షి', ఆ తర్వాత అనిల్ రావిపూడితో 'సరిలేరు నీకెవ్వరు' వంటి చిత్రాలు చేసి వరుస సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం దీన్ని తెరకెక్కిస్తోన్నాడు. బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని సెటైరికల్‌గా రూపొందుతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ గత జనవరిలోనే ప్రారంభం అయింది. అప్పటి నుంచి చిత్ర యూనిట్ పలు షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకుంది. ఇలా ఇప్పటికే దాదాపు అరవై శాతం షూట్‌ను కంప్లీట్ చేసుకున్నారు. ఇంకొంత భాగం అయితే సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది.

'సర్కారు వారి పాట' మూవీని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, అనుకున్న సమయానికి పలు కారణాల వల్ల షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో ఈ సినిమాను 2022, ఫిబ్రవరి 1కి వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక, ఈ డిసెంబర్ నాటికి టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయాలని చిత్ర యూనిట్ టార్గెట్ పెట్టుకుంది. ఇంతలోనే మహేశ్ బాబు మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. అంతేకాదు, దాదాపు ఐదారు వారాల పాటు విశ్రాంతి తీసుకోబోతున్నాడు. దీంతో ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపించింది.
తాజా సమాచారం ప్రకారం.. 'సర్కారు వారి పాట' మూవీ షూటింగ్ డిసెంబర్ 16 నుంచి పున: ప్రారంభం కాబోతుందట. హైదరాబాద్‌లోనే ఈ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇందులో మహేశ్ బాబు లేని సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని అంటున్నారు. అంటే.. హీరో విశ్రాంతిలో ఉన్నా సినిమా షూటింగ్ మాత్రం ఆగకుండా మూవీ యూనిట్ ప్లాన్ చేసిందన్న మాట. ఇలా చేయడం వల్ల సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయొచ్చన్న అభిప్రాయంతో చిత్ర బృందం ఉందని తెలుస్తోంది.
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'సర్కారు వారి పాట' మూవీలో మహేశ్ బాబు క్లాస్, మాస్‌గా రెండు రోల్స్ చేస్తున్నాడని అంటున్నారు. ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకూ విడుదలైన అన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక, ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 1న విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











