అ! దర్శకుడితో మహేష్ సోదరి కొత్త ప్రయోగం!
సూపర్ స్టార్ మహెష్ బాబు సోదరి మంజుల ఇప్పటికే నటిగా రాణించారు. ఇటీవల నచ్చింది చిత్రంతో దర్శకురాలిగా మారారు. ఆ చిత్రం దర్శకురాలిగా మంజులకు గుర్తింపు తీసుకుని వచ్చింది. అప్పుడప్పుడూ వెండి తెరపై మంజుల నటిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా మంజుల ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి తెరతీయబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలకు పోటీగా వెబ్ సిరీస్ లు కూడా రాణిస్తున్నాయి. ఆ దిశగా మంజుల ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ని నిర్మించే ఆలోచనలో ఆమె ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అ! చిత్రంలో దర్శకుడిగా సత్తా చాటిన ప్రశాంత్ వర్మతో మంజుల చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











