Just In
Don't Miss!
- News
కూలిన ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్.. పైలట్ మృతి.. మరొకరికి తీవ్రగాయాలు
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్ బాబు సరికొత్త వ్యాపారం.. లాంచింగ్ డేట్ చెప్పి సర్‌ప్రైజ్ చేసిన సూపర్ స్టార్
వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాపార రంగం లోనూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే సొంత బ్యానర్ ప్రారంభించి, భారీ మల్టిప్లెక్స్ థియేటర్ నిర్మించిన మహేష్.. తాజాగా మరో వ్యాపారాన్ని అనౌన్స్ చేశాడు. అభిమానులకు మరింత దగ్గరవుతూ సినిమాలతో పాటు వ్యాపార రంగం వైపు ఆయన వేస్తున్న అడుగులు పలువురి చేత భేష్ అనిపించుకుంటున్నాయి. తాజాగా ఆయన ప్రకటించిన కొత్త వ్యాపారం ఏంటి? వివరాల్లోకి పోతే..

సరికొత్తగా ఆలోచించి.. డిఫరెంట్ రంగం వైపు
ఇప్పటిదాకా సినిమాలకు సంబంధించిన వ్యాపార కార్యకలాపాలు చేస్తూ వచ్చిన మహేష్ బాబు.. ఈ సరి కొత్తగా ఆలోచించి డిఫరెంట్ రంగం వైపు అడుగులు వేశాడు. తాను వస్త్ర రంగం లోకి అడుగుపెడుతున్నట్లుగా అఫీషియల్ ప్రకటన చేసి తన బ్రాండ్ నేమ్ ప్రకటించాడు మహేష్. ఈ మేరకు ట్వీట్ చేస్తూ లాంచింగ్ తేదీ కూడా చెప్పాడు.
|
విజయ్ దేవరకొండ రౌడీ అంటే.. మహేష్ మాత్రం
ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వస్త్ర రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తన బ్రాండ్ నేమ్ 'రౌడీ' అని పెట్టగా, మహేష్ బాబు మాత్రం తన బ్రాండ్ నేమ్ 'హంబుల్' అని ప్రకటించాడు. ఈ సంస్థ ద్వారా వస్త్రాలతో పాటు ఇతర వస్తువులను కూడా అందుబాటులోకి తెస్తానని ప్రకటించాడు మహేష్.

లాంచింగ్ తేదీ ఎప్పుడంటే..
'హంబుల్' పేరుతో కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లుగా ప్రకటించిన మహేష్ బాబు.. ఈ బ్రాండ్‌ని ఆగస్టు 7 వ తేదీన లాంచ్ చేస్తున్నట్లుగా తెలిపాడు. ది హంబుల్ కో పేరుతో కొత్త వ్యాపారం మొదలుపెట్టానని, మీ అందరికీ వెల్‌కమ్ చెబుతున్నానని మహేష్ బాబు ప్రకటించాడు.

మహేష్.. సరిలేరు నీకెవ్వరు
'మహర్షి' సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి ముఖ్యపాత్ర పోషిస్తోంది.