విమానం గల్లంతు.. మహేష్ బాబు క్రేజీగా ఏం చేశారంటే!
వెండి తెరపైనే కాదు.. వ్యాపార ప్రకటనల్లోనూ మహేష్ బాబు సూపర్‌స్టారే. ప్రముఖ ఉత్పత్తుల కంపెనీలకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ తన బ్రాండ్ వ్యాల్యూను పెంచుకొన్న స్టార్ ప్రిన్స్. తాజాగా ఆయన నటించిన థమ్స్ యాడ్ మరింత క్రేజీగా ఉంది. ఈ యాడ్‌లో ప్రిన్స్ జర్నలిస్టుగా నటించడం విశేషం.

యాడ్ కాన్సెప్ట్ ఏమిటంటే.. ముఖ్యమైన సమాచారం శోధన కోసం వెళ్లిన జర్నలిస్టుల విమానం గల్లంతు అవుతుందని వార్తలు గుప్పుమంటాయి. ఓ నిర్మానుష్యమైన ప్రాంతంలో మహేష్ ప్రయాణించిన విమానం కూలిపోయి ఉంటుంది. దానిని మరమ్మత్తు చేసి ఓ కొండపై నుంచి విలువైన సమాచారంతో విమానంతోపాటు పారాచూట్ ధరించి కిందకు దూకుతాడు.
తాజా థమ్స్ యాడ్ హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించినట్టు ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఈ యాడ్ గురించి మహేష్ తాజాగా ట్వీట్ చేశారు. నా కొత్త థమ్స్ అప్ యాడ్ చూసి చార్జ్ అవ్వండి. ఈ వీడియోను మీతో పంచుకోవడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది అని మహేష్ ట్వీట్ చేశారు.

కాగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ రూపొందించిన మహర్షి చిత్రం మే 9న రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటించింది.


Click it and Unblock the Notifications











