For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గౌతమ్.. ఎగిరేందుకు రెక్కలు వచ్చాయి.. ప్రపంచానికి నీ మార్కు చూపించు.. నమ్రత ఎమోషనల్ పోస్టు

  |

  సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు ఘట్టమనేని ప్రతిష్టను నిలబెడుతున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. సూపర్ స్టార్ ట్యాగ్‌కు కొత్త నిర్వచనం చెబుతున్నాడు మహేష్ బాబు. ఇప్పుడు ఘట్టమనేని ఫ్యాన్స్‌కే కాదు.. తెలుగువారందరికీ మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టం. ఆయన సినిమాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆడుతున్నాయి. మహేష్ బాబు రేంజ్ రోజురోజుకూ పెరుగుతోంది. వయసు, అందం తగ్గిపోతోంది. అలాంటి మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు గౌతమ్ మీద ఫోకస్ పెట్టేశారు.

  పుట్టుకతోని..

  పుట్టుకతోని..

  గౌతమ్ పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ మధ్య ఎన్‌బీకే అన్ స్టాపబుల్ షోలో బాలయ్యతో కలిసి మహేష్ బాబు కొన్ని విషయాలను పంచుకున్నాడు. గౌతమ్ పుట్టినప్పుడు నా అరచేతి అంతే ఉన్నాడంటూ.. మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు ఎంతో కష్టపడ్డామని చెప్పుకొచ్చాడు. అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దనే ఇప్పుడు పిల్లలకు ఉచితంగా ఆపరేషన్‌లు చేసే కార్యక్రమం మొదలుపెట్టానని మహేష్ బాబు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిం

   సినీ ఎంట్రీ..

  సినీ ఎంట్రీ..


  ఇక గౌతమ్ అయితే సితార అంత యాక్టివ్‌గా ఉండడు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు. అయితే 1 నేనొక్కడినే సినిమాతో గౌతమ్ సినీ ఎంట్రీ ఇచ్చాడు. మహేష్ బాబు, గౌతమ్ ఒకే ఫ్రేములో కనిపించడంతో థియేటర్లో అభిమానుల గోలతో టాప్ లేచిపోయింది. అలా గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ జరిగింది.

  తాజాగా అలా..


  ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీ వెకేషన్స్‌లో ఉంది. అక్కడ గౌతమ్ విన్యాసాలు చూసి నమ్రత షాక్ అయినట్టుంది. తన బిడ్డను చూసి మురిసిపోయిన నమ్రత ఇలా చెప్పుకొచ్చింది. నా కొడుకు.. మహేష్ బాబుకు మరో ప్రతిబింబం.. ఏదీ కూడా తనని బాధించలేదు.. చలి, ఎండ, మంచు.. ఎంతో నిశ్శబ్దంగా ఉంటాడు.. నీవు నేర్చుకున్న పారాగ్లైడింగ్ పాఠాలు చూసి నాకు గర్వంగా ఉంది.. ఇక నువ్వు ఎగిరేందుకు టైం వచ్చింది.. నువ్ ఏదైనా చేయగలవన్నా నమ్మకం నాకు వచ్చింది.. ఇక నువ్వు త్వరలోనే నీ మార్కు ప్రపంచానికి చూపిస్తావ్ అంటూ నమ్రత చెప్పుకొచ్చింది.

  ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ..

  ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ..


  నమ్రత వేసిన ఈ పోస్ట్, గౌతమ్ గురించి చెప్పిన తీరుని చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. బాబులకే బాబు గౌతమ్ బాబు, మై లిటిల్ ప్రిన్స్ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. మొత్తానికి గౌతమ్ మాత్రం రానున్న రోజుల్లో తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని మహేష్ బాబు అడుగుల్లో నడవడం ఖాయమనేది స్పష్టంగా కనిపిస్తున్నది.

  లండన్‌లో ఉన్నత విద్య కోసం

  లండన్‌లో ఉన్నత విద్య కోసం


  ఇక గౌతమ్ ఘట్టమనేని విషయానికి వస్తే.. లండన్‌లో ఉన్నత విద్యకు సిద్దమయ్యారు. ఇటీవల మహేష్ బాబు ఫ్యామిలీ అంతా కలిసి లండన్‌లోని ఓ కాలేజీలో గౌతమ్‌కు అడ్మిషన్ ఇప్పించారు. గౌతమ్‌కు సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడని అడిగితే.. మా అబ్బాయి దృష్టంతా వేరే విషయంపై ఉంది. ప్రస్తుతం తన ఇంట్రెస్ట్ ప్రకారం గౌతమ్ వెళ్తున్నాడు. ఫ్యూచర్‌లో గౌతమ్ ఇష్టపడితే సినిమాల్లోకి రావడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదని మహేష్ చెప్పారు.

  English summary
  Mahesh Babu's wife Namrata Shirodkar shared a post on Gautham. She wrote recenntly that, My son .. another mirror image of mb nothing seems to affect him !! Cold .. sun.. snow .. is calm composed demeanour makes me go …. But I love you my little big man boy so so proud of ur Paragliding lesson .. ur set to fly .. n now I’m confident that u will be on ur own soon !!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X