ఆమెను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా.. మనసులో మాట చెప్పిన మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన వృత్తి పట్ల ఎంత నిబద్ధతగా ఉంటారో.. తన కుటుంబం పట్ల అంతే బాధ్యతగా వ్యవహరిస్తుంటారు. తాను ప్రేమించి పెళ్లాడిన భార్య నమ్రత శిరోద్కర్ అంటే ఆయనకు ప్రాణం. ఈ ఇద్దరి అన్యూన్య జీవితం ఎందరికో ఆదర్శం.మహేశ్‌బాబుకు సంబంధించిన అన్ని విషయాల్లో సలహాలు, సూచనలు ఇస్తూ ఎల్లప్పుడూ తోడుంటుంది నమ్రత.
నేడు (జనవరి 22) నమ్రత పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు తన భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 'నా అర్థాంగి.. ఇంటి ఇల్లాలు, జీవిత భాగస్వామికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆమెను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా' అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. మహేశ్ సోదరి మంజుల కూడా నమ్రతకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఆమెతో దిగిన పిక్ షేర్ చేసింది. మహేష్ బాబు అభిమానులు కూడా ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మహేశ్‌బాబు నటించిన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ సక్సెస్ సాధించింది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలించింది. ప్రస్తుతం ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు మహేష్ అండ్ ఫ్యామిలీ.


Click it and Unblock the Notifications











