రజినీకాంత్ సర్ అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు పోస్ట్.. ఏమన్నాడంటే
నేడు (డిసెంబర్ 12) సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ 70వ పుట్టిన రోజు. 69 వసంతాలు పూర్తిచేసుకొని 70వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రజినీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 'మా తలైవా రజనీకాంత్ సర్‌కి జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది మీరు ఆయురాగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీపై ప్రేమ, గౌరవం మాకు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి' అని పేర్కొన్నాడు మహేష్. ఈ ట్వీట్ చూసి మహేష్ అభిమాన వర్గమంతా తలైవాకు బర్త్ డే విషెష్ చెబుతున్నారు.

రజనీకాంత్ ప్రస్తుతం దర్బార్ సినిమాలో నటిస్తున్నాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజినీకాంత్ జోడీగా నయనతార నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే ఈ సినిమా ఆడియో వేడుక ఘనంగా జరిగింది.
మరోవైపు మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. తమన్నా ఐటెం సాంగ్ చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











