సరిలేరు సెన్సార్ పూర్తి.. ఆ సీన్స్ హైలెట్.. టాక్ ఎలా ఉందంటే..?
మహేష్ బాబు సంక్రాంతి బరిలో దిగి బాక్సాఫీస్ పనిపట్టేందుకు సిద్దమవుతున్నాడు. గతేడాది సంక్రాంతికి ఎఫ్2 వంటి భారీ హిట్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి.. మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు చిత్రంపై ఎన్ని అంచనాలు ఏర్పడ్డాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భరత్ అనే నేను, మహర్షి వంటి బ్లాక్ బస్టర్‌ల తరువాత వస్తోన్న ఈ చిత్రంపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి.

జోరుగా ప్రమోషన్ క్యార్యక్రమాలు..
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది యూనిట్. పాటలు, టీజర్, పోస్టర్స్‌తో ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేసిన సరిలేరు టీమ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున ప్లాన్ చేశారు. చిత్రయూనిట్ కూడా మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ మూవీ విశేషాలను చెబుతూ వస్తోంది.

ముఖ్య అతిథిగా చిరు..
కొత్త సంవత్సవరంలో భారీ ఎత్తున జరగబోయే మొదటి సినీ ఈవెంట్ఇదేనంటూ.. మెగాస్టార్ చిరంజీవి సరిలేరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాబోతోన్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. జనవరి 5వ తేదీని ఎల్బీ స్టేడియంలో గ్రాండ్‌గా ఈ ఈవెంట్‌ను నిర్వహించబోతోన్నట్లు తెలుస్తోంది.

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..
సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్దమైన సరిలేరు మూవీకి కాసేపటి క్రితమే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అయితే విడుదల విషయంలో ఇంకా తాత్సారం జరుగుతుండటంతో రిలీజ్ డేట్‌ను మాత్రం ప్రకటించలేదు. ఈ మూవీకి సెన్సార్ సభ్యలు యూ/ఏ సర్టిఫికేట్ జారి చేశారు.

అదిరిపోయిన టాక్..
అయితే సినిమా టాక్ కొంచెం లీకైనట్టు తెలుస్తోంది. ఫస్టాఫ్‌లో దాదాపు 40 నిమిషాలు ఆర్మీ ఎపిసోడ్స్ ఉంటాయని, ఆపై ట్రైన్ సీన్స్‌లోకామెడీ అదిరిపోతుందని టాక్. ఇంతవరకు టాలీవుడ్‌లో రాని విధంగా ఇంటర్వెల్ సీన్ ఉంటుందని సమాచారం. సెకండాఫ్‌లో రెండు యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ సీన్స్ మాత్రం పీక్స్‌లో ఉంటాయని, క్లైమాక్స్ గురించి చెప్పనక్కర్లేదని తెలుస్తోంది. మొత్తానికి సంక్రాంతి విన్నర్‌గా నిలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం.


Click it and Unblock the Notifications











