సరిలేరుకు టైమ్ ఫిక్స్ అయింది.. మహేష్ ఎప్పుడు వస్తున్నాడంటే..?

భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌లు కొట్టిన సూపర్ స్టార్.. మరో సారి బాక్సాఫీస్‌ను షేక్ చేసి తనకు నిజంగానే ఎవరూ సరిలేరని నిరూపించేందుకు టైమ్ ఫిక్స్ చేసుకున్నాడు. అనిల్ రావిపూడితో చేస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదల తేదీని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఎన్నో ప్రత్యేకలతో వస్తోన్న ఈ చిత్రం సూపర్ స్టార్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని యూనిట్ చెప్పుకొస్తుంది. లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం, బండ్ల గణేష్ ఓ ముఖ్యమైన రోల్ చేయడం ఇలా ప్రతీదీ కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకున్న దర్శకుడు సూపర్ స్టార్‌ను ఓ రేంజ్‌లో చూపించాడని టాక్.

ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్ సినిమాపై ఎన్నో అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన కర్నూలు కొండారెడ్డి బుర్జు సెట్ ప్రత్యేకంగా నిలుస్తుందని టాక్. దీని చుట్టు జరిగే సీన్స్, యాక్షన్ పార్ట్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేసేలా చేస్తాయని తెలుస్తోంది.

Mahesh Babu Sarileru Neekevvaru Movies Releasing On 12th January

ఇక ఈ మూవీ అఫీషియల్ డేట్ వచ్చేసిందని మహేష్ చేసిన ట్వీట్‌కు దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన రిప్లై ఆకట్టుకుంటోంది. అఫీషయల్ .. మహేషియల్ అంటూ ఇక పండగ మొదలుపెడదామని అన్నాడు. జనవరి 12 న సరిలేరు నీకెవ్వరు థియేటర్లలోకి వచ్చేందుకు ఫిక్స్ అయింది. రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి రత్నవేలు కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X