సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఇక పండుగే.. సరిలేరు టీజర్ ఆ రోజే.. నేటి సాయంత్రం అధికారిక ప్రకటన

పోస్టర్‌లతో సినిమాపై అంచనాలు పెంచేసిన మహేష్ బాబు కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరుపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్ బస్టర్‌ల తరువాత వచ్చే ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అయి తమ హీరో హ్యాట్రీక్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇంతవరకు అపజయం ఎదురు కాని దర్శకుడు అనిల్ రావిపూడి తమ హీరోను ఎంత పవర్‌ఫుల్‌గా చూపిస్తాడని అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ పై ఫోకస్ పెంచింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా సరిలేరు నీకెవ్వరు మూవీ టీజర్ ని విడుదల చేయనున్నట్లు.. కొద్దిరోజుల క్రితం హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీజర్ లోడ్ అవుతోందంటూ దర్శకుడు ట్వీట్ చేసిన నిమిషాల్లోనే అది వైరల్ అయింది.

Mahesh Babu Sarileru Neekevvaru Teaser Date Will Be Unlocked 19th November

అయితే నేటి సాయంత్రం 6:03నిమిషాలకు టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఈ మేరకు యూనిట్ అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేశారు. టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేష్ ఫ్యాన్స్ ఈ ప్రకటనతో పండుగ చేసుకోవడం ఖాయం. ఈనెల 23న ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి జన్మదినం నేపథ్యంలో ఆరోజు టీజర్ విడుదల చేసే అవకాశం కలదని కొందరు భావిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర మరియు మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, విజయ శాంతి ఓ కీలక రోల్ చేస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X