సర్కారు వాటి పాట లేటెస్ట్ అప్డేట్.. ఆ పనులు ఎంతవరకు వచ్చాయంటే?
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు హిట్ అనంతరం మరో కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తెరకెక్కించనున్న సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ నుంచే ఆడియెన్స్ లో అంచనాల డోస్ పెంచేసింది. ఇక సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ని మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు పరశురామ్, కెమెరామెన్, లైన్ ప్రొడ్యూసర్ తో కలిసి లొకేషన్స్ కోసం అమెరికా వెళ్లారు.
గత కొన్ని రోజులుగా అక్కడే లొకేషన్స్ కోసం రీసెర్చ్ చేస్తున్న వారు ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ కి అవసరమయ్యే ప్లాన్ రెడీ చేశారట. ఇక ఫైనల్ గా నటీనటులు అమెరికా వస్తే షూటింగ్ ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే వీసాలకు ఇంకా గ్రేన్ సిగ్నల్ లభించలేదని తెలుస్తోంది. నెలరోజుల పాటు అక్కడే ఉండాలి కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో వీసా అనుమతులు అలస్యమయ్యేలా ఉన్నాయని సమాచారం. ఇక దసరా అనంతరం చిత్ర యూనిట్ సభ్యులు అమెరికాలో కలుసుకునే అవకాశం ఉన్నట్లు టాక్.

ఆ షెడ్యూల్ తరువాత మళ్ళీ ఇండియాకు వచ్చే మిగిలిన షూటింగ్ ని తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లలో ఫినిష్ చేయనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్ లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక యంగ్ కుర్రాడిలా కనిపిస్తున్న సూపర్ స్టార్ సినిమాలో కొన్ని మాస్ యాంగిల్స్ ని కూడా చూపించనున్నట్లు టాక్. సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఆమె ఒక బ్యాంక్ ఎంప్లాయ్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











