Sarkaru vaari paata Birthday Blaster: మరోసారి విశ్వరూపం చూపించిన మహేష్ బాబు.. బొమ్మ అదిరింది!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సర్కారు వారి పాట సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేద. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సోషల్ మీడియాలో అయితే రోజురోజుకు సరికొత్త బజ్ క్రియేట్ చేస్తోంది. ఇక నేడు సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ ను బర్త్ డే బ్లాస్టర్ అంటూ విడుదల చేశారు. చెప్పినట్టుగానే బొమ్మ బ్లాక్ బస్టర్ అనేలా ఉంటుందని మరోసారి రుజువు చేశారు. టీజర్ లో అయితే మహేష్ బాబు నెవర్ బిఫోర్ అనే సరికొత్త స్టైల్ తో దర్శనమిచ్చాడు. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని మరోసారి అభిమానులకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ టీజర్ ను చెప్పిన సమయం కంటే కాస్త ముందే విడుదల చేసే మరింత కిక్ ఇచ్చాడు అర్ధరాత్రి నుంచే సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది.

చెప్పిన టైమ్ కంటే ముందుగానే
సర్కారు వారి పాట బర్త్ డే బ్లాస్టర్ ను మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9గంటలకు విడుదల చేయనున్నట్లు రెండు రోజుల క్రితమే వివరణ ఇచ్చారు. అయితే చెప్పిన సమయం కంటే ముందుగానే ఆ టీజర్ ను అర్ధరాత్రి విడుదల చేసి మంచి కిక్కిచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా ఫస్ట్ లుక్ నుంచే అంచనాల డోస్ అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. మహేష్ బాబు కూడా అభిమానులకు ప్రతిసారి కొత్తగానే దర్శనమిస్తుంటాడు. ఇక దర్శకులు సైతం మహేష్ బాబులోని యాక్షన్ యాంగిల్ ను మాత్రమే కాకుండా కామెడీ యాంగిల్ ను కూడా బాగానే వాడుకుంటున్నారు. మంచి ఎంటర్టైనర్ దర్శకుడిగా పరశురామ్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక మొదటి సారి మహేష్ బాబు ని డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి తప్పకుండా సినిమా మరోలా ఉంటుందని చెప్పొచ్చు.

చితక్కొట్టే యాక్షన్ సీన్
ఇక సర్కారు వారి పాట స్పెషల్ బ్లాక్ బస్టర్ వస్తే.. యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా.. అనే డైలాగ్ తో మొదట మహేష్ బాబు ఎంట్రీతో విజిల్స్ వేయించేలా ఉంటుంది. 'ఇఫ్ టైగర్ టెక్స్ రాబిట్' అంటూ మహేష్ బాబు కూడా తన అద్భుతమైన డైలాగ్ డెలివరీతో చితక్కొట్టే యాక్షన్ సీన్ నిజంగానే అభిమానులను మంత్రముగ్దులను చేస్తోంది.. ఇఫ్ యూ మిస్ ద ఇంట్రెస్ట్ యు విల్ గేట్ డెడ్.మ్ అంటూ విలన్స్ కు గట్టిగానే వార్నింగ్ కూడా ఇచ్చాడు.. యాక్షన్ అయితే హార్డ్ కోర్ అభిమానులు చొక్కాలు చింపుకునేలా ఉన్నాయి అని చెప్పవచ్చు.

ప్రతి రోజు దిష్టి తీయడం మర్చిపోకండి
ఇక ఈ సినిమా ద్వారా మొదటి సారి కీర్తి సురేష్ మహేష్ బాబు తో నటిస్తున్న విషయం తెలిసిందే మహేష్ బాబు కు ఆమె క్యారెక్టర్ అయితే ఫిదా అయినట్లు క్లారిటీగా అర్థమవుతొంది. 'సార్ పడుకునే ముందు ప్రతి రోజు దిష్టి తీయడం మర్చిపోకండి' అంటూ తన ప్రేమను టీజర్ లోనే చూపించేసింది. దీంతో వీరిద్దరి మధ్య మంచి రొమాంటిక్ ఎంటర్ టైన్ మెంట్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నట్లు అర్థమవుతుంది. అనంతరం మహేష్ బాబు కూడా తనలోని కామెడీ యాంగిల్ ను మరోసారి సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎమోయ్ కిషోర్ ఐదారు మూరలు ఉండవు.. అంటూ హీరోయిన్ కీర్తి సురేష్ జడపై ఉన్న పూల గురించి డిఫరెంట్ యాంగిల్ లో కామెంట్ చేస్తాడు.

మరోసారి అదరగొట్టేసాడు
ఫైనల్ గా ఈ టీజరైతే అభిమానులకు మంచి కిక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఫస్ట్ లుక్ టీజర్ తో అంతకుమించి అనేలా సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయమని అర్థమైపోతోంది. ఇక సినిమా టీజర్ లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పనితనం కూడా గట్టిగానే కనిపిస్తోంది. మహేష్ బాబుతో చేసిన ప్రతి సినిమాలో థమన్ సరికొత్త మ్యూజిక్ తోనే అంచనాలు గట్టిగా పెంచేస్తున్నారు. థమన్ ఇచ్చే పాటలో ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థమన్ మరోసారి తన పనితనాన్ని చూపించబోతున్నట్లు టీజర్ తోనే ఒక క్లారిటీ ఇచ్చేశాడు.
Recommended Video

కీర్తి సురేష్ ఫిదా
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అద్భుతంగా ఉందని యాక్షన్ సన్నివేశాలకు తగ్గట్లు గానే తమన్ అదరగొట్టేశాడు అంటూ అభిమానులు అయితే చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ మరోసారి బ్యూటిఫుల్ గర్ల్ గా దర్శనమిచ్చింది. మహేష్ బాబుతో ఆమె మొదటిసారి చేస్తున్న సినిమా కాబట్టి ఈ కాంబినేషన్ పై కూడా అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సినిమా విషయానికి వస్తే మహేష్ బాబు బ్యాంకులో నుంచి డబ్బులు తీసుకున్న బడా బాబులను ఒక ఆట ఆడుకునే క్యారెక్టర్ లో కనిపిస్తాడట. ఇక సినిమాలో పేదవాళ్లకు సంబంధించిన కీలకమైన అంశం మంచి సందేశం ఇచ్చేలా ఉంటుందట. దర్శకుడు పరశురామ్ ఇది వరకే సినిమాలో మంచి సందేశం ఉంటుందని ఒక క్లారిటీ ఇచ్చేశాడు ముఖ్యంగా హార్డ్ కోర్ అభిమానులు విజిల్స్ వేసి చొక్కాలు చింపుకునేలా ఉంటుందని చెప్పాడు.


Click it and Unblock the Notifications











