Sarkaru Vaari Paata సెన్సార్ రివ్యూ.. ఇంటర్వెల్ బ్యాగ్ అదుర్స్.. సినిమా ఎలా ఉందంటే?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సర్కారు వారి పాట పేరు హాట్ టాపిక్ గా మారింది. చాలా గ్యాప్ తరువాత మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా కావడం అలాగే పరశురామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో అంచనాలు పెరిగిపోయాయి. అంతే కాకుండా సినిమాకు సంబంధించిన సాంగ్స్ ట్రైలర్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ అందుకోవడంతో సినిమాపై పూర్తిగా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇక సినిమా మొత్తానికి సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుంది. అటు వైపు నుంచి వచ్చిన టాక్ ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే...

మాస్, యాక్షన్..
మహేష్ బాబు - కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమాను దర్శకుడు పరశురామ్ మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కథాంశంతో తెరకెక్కించాడు. మహేష్ బాబు ఈ సినిమాలో రికవరీ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. ట్రైలర్ లోనే హీరో క్యారెక్టర్ ను అన్ని రకాల ఎలిమెంట్స్ తో హైలెట్ చేశారు.

సెన్సార్ టాక్
ఇక సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులను ఇటీవల పూర్తి చేసుకుంది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హేవగా ఉండడంతో U/A సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ సీన్ నెవ్వర్ బీఫోర్ అనేలా మహేష్ మెస్మరైజ్ చేయబోతున్నాడట. అలాగే డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది.

పాజిటివ్ రిపోర్ట్
దర్శకుడు పరశురామ్ గీతగోవిందం లాంటి సినిమా తరువాత ఇలాంటి మాస్ కమర్షియల్ సినిమాతో వస్తాడాని ఎవరు ఊహించి ఉండరు. ఇక సెన్సార్ యూనిట్ నుంచి కూడా చిత్ర యూనిట్ సబ్యులకు శుభాకాంక్షలు అందినట్లు సమాచారం. సినిమా చాలా అద్భుతంగా ఉందని సమ్మర్ లో అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే విధంగా సినిమాను తెరకెక్కించినట్లగా వారి నుంచి స్పందన వచ్చినట్టు తెలుస్తోంది.

మహేష్ తో కీర్తి సురేష్..
ఫస్ట్ హాఫ్ లో మహేష్ బాబు క్యారెక్టర్ పరిచయం అవుతూనే పలు కామెడీ సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉంటాయట. అంతే కాకుండా మహేష్ కీర్తి సురేష్ తో నటించే కొన్ని సన్నివేశాలు కూడా చాలా రొమాంటిక్ గా ఉంటాయని తెలుస్తోంది. అందులోనే చిరునవ్వు తెప్పించే కామెడీ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయని సమాచారం.

ఇంటర్వెల్ బ్యాంగ్
ఇంటర్వెల్ బ్యాంగ్ లో పవర్ఫుల్ విలన్ సముద్రఖనితో జరిగే పోరాట సన్నివేశాల అనంతరం మహేష్ చేసే ఛాలెంజ్ కు కొనసాగింపుగా సెకండ్ హాఫ్ నడుస్తుంది. ఇక ఆ తరువాత అతను మరో మేయిన్ విలన్ అలాగే నేటితరంలో ఎక్కువగా ఉండే ఒక మంచి అంశాన్ని కూడా సందేశాత్మకంగా చూపిస్తారట.

ఫైనల్ గా..
మొత్తంగా సినిమా మహేష్ బాబు స్థాయిని మరో లెవెల్ కు పెంచే విధంగా ఉంటుందని ఇటీవల దర్శకుడు చెప్పిన విషయం కూడా నిజమే అవుతుందని సెన్సార్ నుంచి టాక్ వస్తోంది. మహేష్ ఫ్యాన్స్ విజిల్స్ వేసే సన్నివేశాలు కూడా సెకండ్ హాఫ్ లో ఉంటాయని టాక్. ఇక చివరగా మాస్ సాంగ్ లో మహేష్ స్టెప్పులు కూడా ఆకట్టుకుంటాయని సమాచారం. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











