Mahesh Babu: సర్కారు వారి పాట నుంచి సర్‌ప్రైజ్.. న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఏది రాబోతుందంటే!

కొన్నేళ్లుగా వరుస పెట్టి హిట్లు మీద హిట్లు కొడుతూ కెరీర్ మొత్తంలో ఎన్నడూ లేనంత ఫామ్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆ మధ్య ఫ్లాపులతో ఇబ్బందులు పడ్డ అతడు.. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన 'భరత్ అనే నేను'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే మహేశ్ బాబు.. వంశీ పైడిపల్లితో 'మహర్షి', ఆ తర్వాత అనిల్ రావిపూడితో 'సరిలేరు నీకెవ్వరు' వంటి చిత్రాలు చేసి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాడీ స్టార్ హీరో.

మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని సెటైరికల్‌గా రూపొందుతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ గత జనవరిలోనే ప్రారంభం అయింది. అప్పటి నుంచి చిత్ర యూనిట్ పలు షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకుంది. ఇలా ఇప్పటికే దాదాపు అరవై శాతం షూట్‌ను కంప్లీట్ చేసుకున్నారు. ఇంకొంత భాగం అయితే సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది.

Mahesh Babus Sarkaru Vaari Paata First Song On January 1st

'సర్కారు వారి పాట' నుంచి ఆ మధ్య 'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' పేరిట ఓ వీడియో విడుదలైంది. దీనికి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ టీజర్ టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను నమోదు చేసింది. దీని తర్వాత ఈ సినిమా నుంచి పాటలను కూడా విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తరచూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ ఉండేవాడు. దీంతో సాంగ్స్ వస్తున్నాయని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పటి వరకూ దీని నుంచి ఏదీ బయటకు రాలేదు. దీనిపై సూపర్ స్టార్ అభిమానులు నిరాశగా ఉన్నారు.

'సర్కారు వారి పాట' నుంచి అప్‌డేట్లు కావాలని కోరుకుంటోన్న మహేశ్ బాబు అభిమానులను ఖుషీ చేసే ఓ న్యూస్ తాజాగా ఫిలిం నగర్ ఏరియాలో తెగ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందట. దీన్ని నూతన సంవత్సర కానుకగా జనవరి 1వ తేదీన విడుదల చేయబోతున్నారని తెలిసింది. ఇది సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేశారని అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన డిసెంబర్ చివరి వారంలో రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీలో మహేశ్ బాబు క్లాస్, మాస్‌గా రెండు రోల్స్ చేస్తున్నాడని అంటున్నారు. ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుందని ప్రకటించారు. కానీ, అప్పటికి ఇది పూర్తయ్యే అవకాశాలు లేకపోవడంతో దీన్ని ఏప్రిల్‌కు వాయిదా వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X