For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సర్కారు వారి పాట నుంచి అదిరిపోయే న్యూస్: ఆ స్పెషల్ డేన ఫస్ట్ సాంగ్ రిలీజ్

  |

  ఆ మధ్య వరుసగా పరాజయాలు రావడంతో ఇబ్బంది పడినా.. వరుసగా వరుస పెట్టి హిట్లు మీద హిట్లు కొడుతూ కెరీర్ మొత్తంలో ఎన్నడూ లేనంత ఫామ్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన 'భరత్ అనే నేను'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన అతడు.. ఆ వెంటనే వంశీ పైడిపల్లితో 'మహర్షి', ఆ తర్వాత అనిల్ రావిపూడితో 'సరిలేరు నీకెవ్వరు' వంటి చిత్రాలు చేసి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు మహేశ్ బాబు. ఈ ఉత్సాహంతోనే వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.

  దారుణమైన ఫొటోలు వదిలిన సీరియల్ నటి: బాడీ పార్టులు మొత్తం చూపిస్తూ రెచ్చిపోయిందిగా!

  ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం రూపొందిస్తోన్న ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను సెటైరికల్‌గా రూపొందుతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ గత ఏడాది జనవరిలోనే ప్రారంభం అయింది. అప్పటి నుంచి చిత్ర యూనిట్ పలు షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకుంది. ఇలా ఇప్పటికే దాదాపు అరవై శాతం షూట్‌ను కంప్లీట్ చేసుకున్నారు. ఇలాంటి సమయంలో మహేశ్ బాబుకు సర్జరీ జరగడంతో చిత్రీకరణకు బ్రేక్ పడింది.

  Mahesh Babus Sarkaru Vaari Paata First Song On January 26th

  'సర్కారు వారి పాట' నుంచి మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా 'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' పేరిట ఓ వీడియో విడుదలైంది. దీనికి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ టీజర్ టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను నమోదు చేసింది. దీని తర్వాత ఈ సినిమా నుంచి పాటలను కూడా విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తరచూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ ట్వీట్లు చేసేవాడు. కానీ, ఇప్పటి వరకూ దీని నుంచి ఏదీ బయటకు రాలేదు. దీనిపై సూపర్ స్టార్ అభిమానులు నిరాశగా ఉన్న విషయం తెలిసిందే.

  చిన్న క్లాత్‌ చుట్టుకుని ప్రియాంక చోప్రా రచ్చ: బాడీ అంతా కనిపించేలా మరీ ఘోరంగా!

  ఇక, జనవరి నెల నుంచి 'సర్కారు వారి పాట' నుంచి మ్యూజికల్ ఫీస్ట్ మొదలు కాబోతుందని ఇటీవలే చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో న్యూ ఇయర్ కానుకగా పాట వస్తుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేస్తారన్న టాక్ కూడా వినిపించింది. కానీ, అది కూడా సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా నుంచి రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ఓ అదిరిపోయే పాటను విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన సంక్రాంతి పండుగ పర్వదినం అంటే జనవరి 15న వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

  'సర్కారు వారి పాట' మూవీలో మహేశ్ బాబు క్లాస్, మాస్‌గా రెండు రోల్స్ చేస్తున్నాడట. ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుందని ప్రకటించారు. కానీ, అప్పటికి ఇది పూర్తయ్యే అవకాశాలు లేకపోవడంతో దీన్ని ఏప్రిల్‌కు వాయిదా వేశారు.

  English summary
  Mahesh Babu Now Doing Sarkaru Vaari Paata Movie under Parasuram Direction. This Movie First Song Will Be Release On January 26th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X