సర్కారు వారి పాట రన్ టైమ్ ఫిక్స్.. అలా తెలివిగా సెట్ చేసిన దర్శకుడు!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత కెరీర్ లో అతిపెద్ద గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా పరిస్థితుల కారణంగా అనుకోకుండా వచ్చిన ఈ గ్యాప్ తో మహేష్ బాబు వెండితెరకు చాలా దూరం అయ్యాడు. ఇక సర్కారు వారి పాట సినిమాతో మళ్లీ ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సక్సెస్ అందుకోవాలి అని మళ్ళీ ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మహేష్ బాబు సిద్ధమయ్యాడు. ఆ సినిమాకు సంబంధించిన అనేక రకాల అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది అని ప్రేక్షకులలో అయితే ఒక నమ్మకం ఉంది. ఇక నిర్మాతలు కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. మహేష్ బాబు సినిమా కెరీర్లోనే ఈ సినిమా అత్యధిక స్క్రీన్లలో విడుదల కానుంది.
మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు 14 రీల్స్ కూడా సహ నిర్మాతగా ఉన్న విషయం తెలిసిందే గీతగోవిందం సినిమా తో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు పరుశురాం ఈ సినిమాను తెరకెక్కించాడు. మహేష్ బాబుతో ఈ దర్శకుడు మొదటిసారి సినిమా చేస్తూ ఉండడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా మరింత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయడంతో సినిమా మొదటిరోజు ఓపెనింగ్స్ ద్వారానే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అర్థం అవుతోంది.

ఇక థమన్ ఇచ్చిన సాంగ్స్ కూడా ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ఫినిష్ చేసుకుంది. సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుని సెన్సార్ యూనిట్ నుంచి ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. మొత్తంగా సినిమా రెండు గంటల 43 నిమిషాల నిడివితో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే 163 నిమిషాలు సినిమా ప్రేక్షకులకు అంచనాలకు తగ్గట్టుగా అనుభూతిని ఇస్తుంది అని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఎక్కడా ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా పర్ఫెక్ట్ రన్ టైమ్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది. అయితే సర్కారు వారి పాట ప్రత్యేకంగా ఉండాలి అనే రెండు ప్రత్యేకమైన ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముందుగా సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్ ను నిర్వహించి అనంతరం థమన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక మ్యూజిక్ ఈవెంట్ ను కూడా భారీ స్థాయిలో నిర్వహించాలి అని అనుకుంటున్నారు. అందుకోసం ఖర్చు విషయంలో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకూడదని కూడా అనుకుంటున్నారు. మరి ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతున్న సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











