అఫీషియల్:మహేష్ 'సర్కారు వారి పాట'.. న్యూ లుక్ అదిరింది!

సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు గత కొంత కాలంగా కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన రూమర్స్ ఇన్నాళ్లు అభిమానులను కన్ఫ్యూజన్ కి గురి చేశాయి. ఇక ఎట్టకేలకు కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా అన్ని అనుమానాలకు తెర దించుతూ చిత్ర యూనిట్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చింది.

సర్కారు వారి పాట..

సర్కారు వారి పాట..

గత కొన్నిరోజులుగా సినిమాకు సంబంధించిన టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చిన విషయం తెలిసిందే. 'సర్కారు వారి పాట' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ వచ్చింది. అయితే ఫైనల్ గా చిత్ర యూనిట్ కూడా ఆ టైటిల్ తో పాటు ఒక లుక్ కూడా రిలీజ్ చేసి ఆడియెన్స్ కి మంచి కిక్ ఇచ్చింది.

Recommended Video

Sarkaru Vaari Paata : Mahesh Babu New Look In Sarkaru Vaari Paata | SSMB 27
మహేష్ లుక్కు అదిరింది..

మహేష్ లుక్కు అదిరింది..

ఇక లుక్ విషయానికి వస్తే.. ఒక సైడ్ లో మాత్రమే పోస్టర్ లో మహేష్ ని చూపించారు. మహేష్ చెవి పొగుతో అలాగే మెడపై రూపాయి టాటూ వేసుకోవడం స్టైలిష్ గా ఉంది. చూస్తుంటే మాస్ ఆడియెన్స్ ఈ ట్రెండ్ ని ఫాలో అయ్యేలా ఉన్నారని అనిపిస్తోంది. గతంలో కూడా మహేష్ స్టైల్ ని చాలా మంది ఫాలో అయ్యారు.

సూపర్ స్టార్ బర్త్ డే స్పెషల్..

సూపర్ స్టార్ బర్త్ డే స్పెషల్..

ప్రతి ఏడాది సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే అంటే మహేష్ సినిమాకు సంబంధించిన ఎదో ఒక స్పెషల్ ఎనౌన్స్మెంట్ రావాల్సిందే. ఇక ఇప్పుడు మహేష్ 27వ సినిమా అఫీషియల్ టైటిల్ తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. అసలైతే ఈ సినిమాను మహేష్ ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా వెయిట్ చేయాల్సి వచ్చింది. అలాగే కథలో కొన్ని మార్పులు కూడా చేయాల్సి వచ్చిందట.

చాలా రోజుల తరువాత..

చాలా రోజుల తరువాత..

ఇక చాలా రోజుల తరువాత థమన్ మహేష్ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. చివరగా వీరి కాంబినేషన్ లో 2014లో ఆగడు సినిమా వచ్చిన విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ తో పాటు GMB ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X