twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Mahesh Babu షురూ చేసిన బాబు: ‘సర్కారు వారి పాట’ కోసం అదిరిపోయే సెటప్

    |

    సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు. పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కమర్షియల్ పంథాలోనే సందేశాత్మకంగా రూపొందుతోంది. బ్యాంకులను మోసం చేసి పరావుతోన్న బడా వ్యాపారవేత్తలను ఇందులో టార్గెట్ చేయబోతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా దీని గురించి ఓ అప్‌డేట్ తెలిసింది.

    ఇప్పటికే 'సర్కారు వారి పాట' మూవీకి సంబంధించిన ఒక షెడ్యూల్‌ దుబాయ్‌లో పూర్తైంది. మిగిలిన భాగం చిత్రీకరించాలని అనుకున్నప్పుడు కరోనా రూపంలో అడ్డంకి వచ్చింది. దీంతో చాలా రోజుల పాటు దీనికి గ్యాప్ ఇచ్చారు. ఇక, తాజాగా ఈ సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. కరోనా నిబంధనల ప్రకారం చాలా తక్కువ మంది సభ్యులతో చిత్రీకరణను ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలైనట్లు తెలిసింది. ఇందులో కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తారని అంటున్నారు. తర్వాత విదేశీ షెడ్యూళ్లు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.

    Mahesh Babu Sarkaru Vaari Paata Shooting Started

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సర్కారు వారి పాట'లో మహేశ్ బాబు మాస్ కుర్రాడిలా కనిపిస్తాడట. ఇప్పటికే అతడికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఇందులో సూపర్ స్టార్ ఎంతో స్టైలిష్, రఫ్ లుక్‌తో కనిపించాడు. ఇక, ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మహేశ్ బాబు పుట్టినరోజున ఈ సినిమా నుంచి టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    English summary
    Mahesh Babu Now Doing Sarkaru Vaari Paata Movie under Parasuram Direction. Now This Movie Shooting Started with Action Scene.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X