SVP: మహేష్ బుగ్గను గిల్లేస్తున్న అమ్మాయిలు.. మొత్తానికి ఓ పనైపోయింది

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్క్ బాయ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో చాలా ప్రత్యేకంగా కనిపిస్తాడు అని చెప్పవచ్చు. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అనుకుంటాడు అని అనిపిస్తోంది.

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు నెవ్వర్ బిఫోర్ అనేలా సరికొత్త స్టైల్ ను ఫాలో అవుతున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన కీలకమైన పనిని కూడా ఇటీవల చిత్రయూనిట్ పూర్తిచేసుకుంది. అంతేకాకుండా లొకేషన్ కు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నమ్మకంతో ఉన్న మహేష్

నమ్మకంతో ఉన్న మహేష్

గీత గోవిందం సినిమా తో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు పరశురామ్ మహేష్ బాబు తో సినిమా చేయాలని ఎప్పటినుంచో కలలు కంటున్నాడు. ఇక ఫైనల్ గా అతనికి సర్కారు వారి పాట తో అవకాశం దక్కింది. మహేష్ బాబు కూడా ఈ సినిమా పై చాలా నమ్మకంతో ఉన్నాడు. మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు చివరిలో మంచి సందేశం కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. తప్పకుండా మహేష్ అభిమానులు చొక్కాలు తెచ్చుకునేలా సినిమా ఉంటుంది అని ఇటీవల దర్శకుడు ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.

మొదటిసారి మహేష్ బాబుతో..

మొదటిసారి మహేష్ బాబుతో..

సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. మొదటిసారి మహానటి మహేష్ బాబుతో కలిసి నటిస్తుండటంతో సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో ఆమె కళావతి అనే పాత్రలో నటిస్తోంది ఇప్పటికే విడుదలైన టీజర్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాంటిక్ లవ్ సీన్స్ తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందట. ఇక సెకండాఫ్ లో మాత్రం ఒక్కసారిగా యాక్షన్ మూడ్ లోకి వెళ్తుందని సమాచారం.

మహేష్ బాబు బుగ్గను గిల్లేస్తున్న అమ్మాయిలు

మహేష్ బాబు బుగ్గను గిల్లేస్తున్న అమ్మాయిలు

ఇక సినిమాకు సంబంధించిన సాంగ్ షూటింగ్ కూడా ఇటీవల పూర్తయింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో రూపొందిన ఆ సాంగ్ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందట. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. దాదాపు అన్ని పాటలు కూడా పూర్తయ్యాయి. ఇటీవల లోకేషన్ కు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో మహేష్ బాబు చుట్టూ అమ్మాయిలు ఉన్నారు వారందరూ కూడా మహేష్ బాబు బుగ్గను గిల్లేస్తు ఉన్నట్లు అనిపిస్తోంది.

Recommended Video

Megastar Chiranjeevi Special Interview with Natyam Movie Team
రిలీజ్ డేట్ పై అనుమానాలు

రిలీజ్ డేట్ పై అనుమానాలు

సర్కార్ వారి పాటు సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. జనవరి 13న రాబోతున్నట్లు ఇప్పటికే రెండు మూడు సార్లు విడుదల తేదీపై కూడా ఆ క్లారిటీ ఇచ్చారు అయితే. ఆ పోటీలో కొత్త సినిమాలు రావడంతో మళ్లీ చిత్ర నిర్మాతలు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. RRR జనవరి 7న రాబోతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ రానా భీమ్లా నాయక్ జనవరి 12 వస్తుండగా రాధేశ్యామ్ సినిమా 14వ తేదీన రానుంది. ఇక ఈ పోటీ సమయంలో రావడం చాలా రిస్క్ తో కూడుకున్న పని అని మహేష్ బాబు కూడా ఆలోచనలో పడ్డాడట. మరి రిలీజ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X