సర్కారు వారి పాట నుంచి సర్‌ప్రైజింగ్ న్యూస్: మహేశ్ లేకపోయినా మొత్తం కంప్లీట్ చేసేశారట
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న బడా హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. తన టాలెంట్లను నిరూపించుకుని తక్కువ సమయంలోనే మంచి గుర్తింపుతో పాటు స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో అతడు 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ హిట్లను సొంతం చేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
ఇటీవల ఫుల్ ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం దీన్ని రూపొందిస్తోన్నాడు. బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను సెటైరికల్‌గా రూపొందుతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ గత జనవరిలోనే ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చిత్ర యూనిట్ పలు షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకుంది. ఇలా ఇప్పటికే దాదాపు అరవై శాతం షూట్‌ను కంప్లీట్ చేసుకున్నారు. ఇంకొంత భాగం అయితే సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి అవుతుంది.
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'సర్కారు వారి పాట' మూవీని సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, అనుకున్న సమయానికి పలు కారణాల వల్ల షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో ఈ సినిమాను 2022, ఫిబ్రవరి 1కి వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. అయినప్పటికీ గత డిసెంబర్ నాటికి టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయాలని చిత్ర యూనిట్ టార్గెట్ పెట్టుకుంది. కానీ, ఇంతలోనే మహేశ్ బాబు మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. అంతేకాదు, దాదాపు ఐదారు వారాల పాటు విశ్రాంతి తీసుకోబోతున్నాడు. దీంతో ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు.

మహేశ్ బాబు ప్రస్తుతం అందుబాటులో లేకపోయినా సినిమా షూటింగ్‌పై ఆ ప్రభావం పడకుండా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంది. ఇందులో భాగంగానే అతడు లేని సన్నివేశాలను చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే డిసెంబర్‌లోనే విశాఖపట్నంలో ఓ షెడ్యూల్‌ను మొదలు పెట్టారు. అది శరవేగంగా జరిపినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. వైజాగ్ షెడ్యూల్ జనవరి 15తో ముగుస్తుందట. ఆ తర్వాత మహేశ్ బాబుతో కూడిన చిత్రీకరణను జరపడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
'సర్కారు వారి పాట' మూవీలో మహేశ్ బాబు క్లాస్, మాస్‌గా రెండు రోల్స్ చేస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకూ విడుదలైన అన్నింటికీ భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక, ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 1న విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











