Mahesh Babu: మహేశ్ బాబు చిలిపి పనులను బయటపెట్టిన పంజా డైరెక్టర్.. గట్టిగా ఇరికించేసిన పవన్ దర్శకుడు
తెలుగు సినిమా దగ్గర రీజనల్ గా ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబులు ఇద్దరూ ఇద్దరే అని చెప్పవచ్చు. మరి ఇద్దరి కలయికలో ఎలాంటి సినిమా లేదు కానీ ఈ ఇద్దరి విషయంలో ఎప్పుడూ పలు అంశాలు మంచి ఆసక్తి రేపుతాయి. కాగా ఇలా ఇద్దరూ ఇద్దరే అనే లెవెల్లో బాక్సాఫీస్ యుద్ధం కానీ సోషల్ మీడియాలో రికార్డులు కానీ ఇలా ఇద్దరి ఫ్యాన్స్ నడుమ మంచి రసవత్తరంగానే ఉంటుంది.
అయితే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో ఒక సినిమా దర్శకుడు సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఒక ఊహించని ఫ్యాక్ట్ ని ఒకటి రివీల్ చేయడం సోషల్ మీడియాలో మంచి షాకింగ్ గా మారింది అని చెప్పాలి. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నతనం అంతా చెన్నైలోనే గడిపిన సంగతి తెలిసిందే. అక్కడ తన చదువు, ఎన్నో ఏళ్ళు పాటు అక్కడే స్థిరపడి ఆ తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు.

కాగా మహేష్ బాబు చిన్నతనంలో చాలామంది ఇపుడు సినీ నటులు అంతెందుకు మన తెలుగు స్టార్స్ లో సుమంత్ కూడా మహేష్ బాబుకి క్లాస్ మేట్ అని చాలా మందికి తెలిసిందే. అయితే తనతో పాటుగా ఓ స్టార్ దర్శకుడు కూడా మహేష్ బాబుకి క్లాస్ మేట్ అట. మరి ఆ దర్శకుడు ఎవరో కూడా కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో "పంజా" ప్రభాస్ నటించిన "బిల్లా" సినిమాకి ఒరిజినల్ తీసిన తమిళ్ బిల్లా లాంటి భారీ హిట్స్ సినిమా దర్శకుడు విష్ణువర్ధన్ అట.
కాగా విష్ణువర్ధన్ లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ ఇపుడు మహేష్ అభిమానులని ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రతీ ఒక్కరి స్కూల్ ఏజ్ లో డెఫినెట్ గా ఏదొక తుంటరి పనులు చేసే ఉంటారు. కాగా మహేష్ బాబు, తాను కూడా అలాంటివి చేశామని చెప్పుకొచ్చారు. తమ స్కూల్ లో అప్పట్లో మేము ఓ చోటుకి వెళ్లి ఎగ్జామ్ పేపర్లు తీసుకొని అమ్మేసేవాళ్ళం అని ఇది చెప్తున్నానందుకు మహేష్ నను క్షమించు అంటూ కామెడీగా మహేష్ బాబు తన చిన్న ఏజ్ లో చేసిన క్రేజీ పని కోసం రివీల్ చేశారు.
అప్పట్లో ఆ సబ్జెక్టు ఈ సబ్జెక్టు అని ఏది లేదని ఏది దొరికినా పేపర్ 500కి అలా అమ్మేవాళ్ళం అని చెప్పారు. కానీ అక్కడ ట్విస్ట్ ఏమిటంటే తాను ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యానని పంజా దర్శకుడు మరో ఫన్ ఫాక్ట్ రివీల్ చేశారు. దీనితో ఇది విన్న మహేష్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా ఒకింత ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళితో సెన్సేషనల్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉండగా విష్ణువర్ధన్ తాను తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా 'ప్రేమిస్తావా' రిలీజ్ తో తెలుగు ఆడియెన్స్ ని మరొక్కసారి పలకరించేందుకు వచ్చారు.


Click it and Unblock the Notifications











