మహేష్ బాబు మేనకోడలిని చూశారా.. తల్లితో అలా.. బ్యూటీఫుల్ ఫొటో వైరల్..
ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకొని ఆ తర్వాత తన కుటుంబ సభ్యులకూడా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చే విధంగా ఒకదారిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు ఆయన వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక మరి కొంతమంది కుటుంబ సభ్యులు ప్రైవేట్ లైఫ్ ను ఎక్కువగా ఇష్టపడతారు. ఇక మహేష్ బాబు సోదరి కూతురుకి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ఫ్యామిలీ లైఫ్
గట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ సినిమాలతో ఒకప్పుడు చాలా బిజీగా ఉండేవారు. అయితే ఆయన సినిమాలతో ఎంత తీరికలేకుండా గడిపినా కూడా కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని కూడా గడిపేవారు. ఇక అదే అలవాటు సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా దక్కింది. అతను కూడా ఫ్యామిలీ లైఫ్ తో ఎంజాయ్ చేసేందుకు ఎక్కువ కష్టపడుతూ ఉంటాడు. సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి హాలిడేస్ కు కూడా వెళుతూ ఉంటాడు.

హీరోయిన్ గా ప్రయత్నం
మహేష్ బాబుకు ముగ్గురు సోదరీమణులు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఘట్టమనేని మంజుల మాత్రమే సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రావాలి అని అనుకుంది. మొదట ఆమె హీరోయిన్ గా ప్రయత్నాలు కూడా చేసింది. అప్పట్లో బాలకృష్ణతో ఒక సినిమా చేయాలని ఆమె ఆసక్తి చూపించినప్పటికీ కూడా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు మాత్రం ఒప్పుకోలేదు. దీంతో హీరోయిన్ కావాలనే కోరికను అక్కడితోనే మరిచిపోయారు.

మహేష్ సినిమాలతో
హీరోయిన్ గా ఘట్టమనేని మంజుల తన కెరీర్ ను కొనసాగించకపోయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా అయితే సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. సొంతంగానే ప్రొడక్షన్ హౌస్ ను కూడా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. పోకిరి సినిమాకు కూడా సహనిర్మాతగా వ్యవహరించారు. అలాగే మహేష్ బాబుకు సంబంధించిన మరికొన్ని సినిమాల్లో కూడా ఆమె పెట్టుబడులు పెట్టి మంచి ప్రాఫిట్స్ అందుకున్నారు.

యూట్యూబ్ ఛానెల్
ఘట్టమనేని మంజుల ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా చురుగ్గా కనిపిస్తున్నారు. రీసెంట్ గా ఆమె యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో ప్రత్యేకంగా సూపర్ స్టార్ కృష్ణ ఇంటిని కూడా చూపించారు. ఇక ఇన్స్టాగ్రామ్ లో కూడా అదే చాలా చురుగ్గా కనిపిస్తూ ఉంటారు. తన కూతురికి సంబంధించిన ఫోటోలు కూడా పోస్ట్ చేసింది.

మంజుల కూతురు ఫొటో వైరల్
మంజుల కూతురు జాహ్నవి స్వరూప్ కు సంబంధించిన ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మహేష్ బాబుకు జాహ్నవి అంటే కూడా ఎంతో ఇష్టం. మెన కోడళ్ళు మేనల్లుళ్ళు కలిస్తే మహేష్ బాబు ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా మారిపోయి వారితో కూడా చాలా హ్యాపీగా ఉంటాడు అని గతంలో మంజులా తెలియజేశారు. ఇక జాహ్నవి చూస్తుండగానే చాలా పెద్దదైపోయింది అని ఆమెపై సోషల్ మీడియాలో కూడా ఎమోషనల్ గా ఒక వివరణ ఇచ్చారు. ఇక అందుకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











