పోలీసులను ఆశ్రయించిన మహేష్ బాబు సోదరి.. డబ్బు తీసుకొని మోసం చేశారంటూ కేసు నమోదు
ఇటీవల కాలంలో డబ్బుతో ఆశచూపి టాలీవుడ్ ప్రముఖులను బోల్తా కొట్టిస్తున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. అధిక వడ్డీలు వచ్చేలా డీల్స్ సెట్ చేస్తామని ఖచ్చితమైన రిటర్న్స్ అందుతాయని మోసం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఆ లిస్టులో మోసపోయిన వారిలో మహేష్ బాబు సోదరి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మోసం చేసిన అనంతరం ఆమె పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

రాజకీయ నాయకులు పరిచయాలతో..
అధిక వడ్డిలు ఇప్పిస్తానంటూ కొంతమంది సినీ ప్రముఖులతో పాటు బడా వ్యాపారవేత్తలను కూడా మోసం చేస్తున్న ఘటనలు సిటీలో ఎక్కువగా నమోదవుతున్నాయి. గతంలో కొంతమంది రాజకీయ నాయకులు పరిచయాలతో వారి స్థాయిని పెంచుకుంటూ డబ్బున్న వారిని మోసం చేస్తూ దెబ్బ కొడుతున్నారు. మీరు చెల్లించిన దానికి రెండింతలు లాభం వచ్చేలా చేస్తాము అంటూ భారీస్థాయిలో మోసాలు చేస్తున్నారు. ఇక తేడా వస్తే మెల్లగా చేతులు దులుపుకుంటు తప్పించుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

200కోట్లకు టోకరా?
అయితే ఇటీవల కాలంలో సాధారణ జనాలతో పాటు సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలు కూడా భారీ స్థాయిలో మోసాలకు గురి అవుతుండటం విశేషం. శిల్పా చౌదరి అనే పేరు ఇటీవల చాలా వైరల్ అవుతోంది. వరుస మోసాలకు పాల్పడుతున్న ఆమె అధిక వడ్డీ పేరుతో సెలబ్రిటీలను ఎక్కువగా మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు నెలల వ్యవధిలోనే దాదాపు 200 కోట్ల డబ్బుతో బడా సెలబ్రిటీలను మోసం చేసినట్లు కాదు తెలుస్తోంది.

అరెస్ట్ చేసిన పోలీసులు
రీసెంట్ గా దివ్య రెడ్డి అనే మహిళ ఫిర్యాదుతో వీరి మోసాలు ఒక్కొక్కటీగా బయటపడుతున్నాయి. ఇక రంగంలోకి దిగిన పోలీసులు విచారణ అనంతరం తగిన ఆధారాలతో శిల్పతో పాటు ఆమె భర్తను కూడా అరెస్ట్ చేశారు. గత శుక్రవారం అరెస్ట్ చేసిన పోలీసులు 14 రోజుల రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. రియల్ ఎస్టెట్ వ్యాపారం చేస్తామని ఇచ్చిన డబ్బుకు అధిక వడ్డీలు ఇప్పిస్తామని శిల్ప చాలా మందిని మోసం చేసినట్లు కేసులు నమోదవుతున్నాయని పోలీసులు వెల్లడించారు.

మోసపోయిన మహేష్ సోదరి
ఇక శిల్పా చేతిలో మోసపోయిన వారు ఒక్కొక్కరుగా ధైర్యంగా బయటకు వచ్చి కేసులు నమోదు చేస్తున్నారు. ఇక మహేష్ బాబు సోదరి , సుధీర్ బాబు సతీమణి ప్రియదర్శని కూడా మోసానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయంలో ఇటీవల ఆమె ఫిర్యాదు చేశారు. 2.9 కోట్లు తీసుకుని శిల్ప మోసం చేసినట్లు ప్రియదర్శని మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. .
Recommended Video

ఆ డబ్బు ఎక్కడ దాచారు?
ప్రతి వారం డబ్బు కోసం ఆమె కిట్టి పార్టీ నిర్వహించారని ఆ తరువాత డబ్బు తీసుకొని మోసం చేసినట్లు మహేష్ సోదరి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఆమె ఎంతమందిని మోసం చేశారు? ఆ డబ్బును ఎక్కడ దాచారు అనే విషయాన్ని పసిగట్టే పనిలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అలాగే శిల్ప చేతిలో మోసపోయిన వారు ధైర్యంగా వచ్చి పోలీస్ స్టేషన్ కు వచ్చి పిర్యాదు చేయవచ్చని పోలీసులు వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











