మహేశ్ తనయుడు గౌతమ్ మొదటిసారి యాక్టింగ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?

మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ప్రస్తుతం తన స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుంటున్నారు. మరోవైపు తన డెబ్యూ మూవీ కోసం కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు భార్య, గౌతమ్ ఘట్టమనేని తల్లి నమ్రత శిరోద్కర్ యాక్టింగ్ లో శిక్షణ ఇప్పిస్తోంది. తనే దగ్గరుండి యాక్టింగ్ కోర్సును గౌతమ్ తో చేపిస్తున్నట్టు సమాచారం. ఇది ఇలా ఉండగానే గౌతమ్ నటనలో నేర్చుకున్న పాఠాలను అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఆమెకు సంబంధించిన వీడియోలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గతంలో గౌతమ్ ఘట్టమనేని స్కూల్ డే ఫంక్షన్ లో భాగంగా ఓ ఇంగ్లీష్ నాటకాన్ని ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అప్పట్లో అందుకు సంబంధించిన వీడియోలు వైరలైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరోసారి ఓ షార్ట్ ఫిలిం లో గౌతమ్ నటించారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. గౌతమ్ తో పాటు మరో అమ్మాయి కూడా ఆ వీడియో క్లిప్ లో కనిపించింది. గౌతమ్ తన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు.

Mahesh Babu Son Gautam Ghattamaneni Acting Skills

అయితే గౌతమ్ ఘట్టమనేని తన యాక్టింగ్ కోర్సును న్యూయార్క్ లోని ప్రతిష్టాత్మకమైన NYU టిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో కంప్లీట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ వరుసగా ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా గౌతమ్ ఒక మైమ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. అందులో ఫిమేల్ లీడ్ లో తన సహ విద్యార్థి నటించింది. ఇద్దరూ పోటాపోటీగా తమ స్కిల్స్ ను ప్రదర్శించారు. నవరసాలను పండించాడు గౌతమ్. సెటిల్ పర్ఫామెన్స్ తో ఎమోషన్స్ ను బాగా క్యారీ చేశారు.

ఆ వీడియోలో గౌతమ్ తన సహ విద్యార్థినితో క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ కనిపించాడు. ఇక తన బ్లేజర్ లో నుంచి ఒక పేపర్ తీసి అందులో ఉన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా సీరియస్ నెస్ ను ప్రేక్షకులకు చూపించారు. అయితే ఈ వీడియోలో గౌతమ్ మాటలు లేకుండానే భావాలను పలికిస్తూ విషయం అర్థం అయ్యేలా నటించారు. అందుకుగాను గౌతమ్ కు ప్రశంసలు అందుతున్నాయి. ఇక వీడియోను మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. వారసుడు వస్తున్నాడు అంటూ ఉప్పొంగిపోతున్నారు.

అయితే ఈ స్క్రిప్ట్ ను డైరెక్ట్ చేసింది సెరాఫీనా జీరోమి కాగా... గౌతమ్ ఘట్టమనేని ఫిమేల్ లీడ్ లో నటించాడు. అయితే మహేష్ బాబు పక్కన నటించిన ఆ అమ్మాయి ఎవరు అంటూ చాలామంది సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె పేరు కాశ్వి రమణి అని తెలుస్తోంది. ఆమె కూడా టిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతుంది. ఇక గౌతమ్ యాక్టింగ్ స్కిల్స్ చూసిన అభిమానులు మాత్రం ఆనందంతో పొంగిపోతున్నారు. మహేష్ బాబు వారసుడిగా ఇండస్ట్రీని ఏలుతాడంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే గౌతమ్ 1 నేనొక్కడినే.. చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక తన డెబ్యూ మూవీ ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక మహేష్ బాబు ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో SSMB29 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X