Sitara: న్యూయార్క్ వీధుల్లో మహేష్ తనయుడు.. గౌతమ్‌పై సితార కామెంట్ వైరల్

Gautam - Sitara: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరో కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రిన్స్ మహేష్ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. మహేష్ బాబు తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ అందుకొని అనతి కాలంలోని సూపర్ స్టార్ గా మారారు. మహేష్ బాబు నట వారసుడుగా గౌతమ్ ఘట్టమనేని త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో చదువుతోపాటు యాక్టింగ్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అయితే.. గౌతమ్ సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో సడెన్ గా ప్రత్యక్షమైంది. వైరల్ అవుతున్న వీడియో ఏంటో మీరు కూడా ఓ లుక్కేయండి.

సూపర్ స్టార్ మహేష్ బాబు తనయడు గౌతమ్ ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెన్సషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ '1 నేనొక్కడినే' సినిమాలో తొలిసారి కెమెరా ముందు నటించారు. ఈ మూవీలో తన నటనతో మెస్మారైజ్ చేశారు గౌతమ్ ఘట్టమనేని. ఈ మూవీ తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చినా చదువు ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో తన కొడుకుని విదేశాలకు పంపారు మహేష్ అండ్ నమ్రత..

mahesh babu son Gautam Ghattamaneni In New York Roads Video Goes viral sitara ghattamaneni comment

ఈ క్రమంలోనే మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని ప్రస్తుతం న్యూయార్క్ లోని న్యూయార్క్ యూనివర్సిటీలో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. అప్పుడప్పుడూ న్యూయార్క్ లో వీధుల్లో తిరుగుతూ.. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోస్ షేర్ చేస్తున్నాడు. అలా.. తాజాగా గౌతమ్ తన స్నేహితులతో కలిసి న్యూయార్క్ వీధుల్లో తిరుగుతుంటే.. షాన్ రిజ్వాన్ సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయేన్సర్ కంటబడ్డారు. ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్ షేర్ చేసిన వీడియోతో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతున్నాడు.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే..? షాన్ రిజ్వాన్ అనే ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్ న్యూయార్క్ వీధుల్లో తిరుగుతూ.. తన కంటబడిన వారందరీ దగ్గరకి వెళ్లి.. మ్యూజిక్ ప్లే చేసి.. సాంగ్ కనిపెడితే డబ్బులు ఇస్తాను. ఆ వీడియోలను సోషల్ మీడియా పోస్టు చేస్తుంటారు. ఇలా తాజాగా రోడ్ మీద వెళ్తున్న కొంతమందిని ఆపి .. బాలీవుడ్ సాంగ్స్ వినిపించి అవి ఏ సినిమాలోవి చెప్పమన్నాడు. అయితే ఆ ఇన్‌ఫ్లూయెన్సర్ ఆపిన వాళ్ళల్లో మన మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని కూడా ఉన్నాడు. గౌతమ్ తన ఫ్రెండ్స్ తో వెళ్తుంటే.. వారిని ఆపి ఇలా వీడియో తీసాడు ఇన్‌ఫ్లూయెన్సర్. ఇందులో గౌతమ్ కూడా మాట్లాడాడు. ఆ ఇన్‌ఫ్లూయెన్సర్ అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానమిస్తాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

mahesh babu son Gautam Ghattamaneni In New York Roads Video Goes viral sitara ghattamaneni comment

గౌతమ్ ముగ్గురు అబ్బాయిలు, ఓ అమ్మాయి ఉంది. గౌతమ్ ఇలా తన ఫ్రెండ్స్ తో కనిపించడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. గౌతమ్‌ వైరల్ వీడియోను చూసిన సితార ఘట్టమనేని కూడా షాక్ అయ్యారు. 'అన్నయ్య ఇక్కడేం చేస్తున్నావు ?' అంటూ కామెంట్ చేసింది. ఇలా సితార కామెంట్ చేయడంతో మహేష్ ఫ్యాన్స్ అంతా ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోను 214 కే వ్యూస్ రాగా.. దాదాపు 2 లక్షలకు పైగా లైక్స్ సాధించింది. మొత్తానికి షాన్ రిజ్వాన్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

KA Day 2 Box Office: దంచికొడుతున్న కిరణ్ అబ్బవరం.. క మూవీ రెండో రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళితో సినిమా కోసం సిద్ధం అవుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం సూపర్ స్టార్ కూడా చాలా కష్టపడుతున్నారు. ఫిట్ బాడీని పెంచుతున్న మహేష్ బాబు.. గతంలో ఏ సినిమాలో కనిపించని విధంగా పొడవాటి జట్టు, గుబురు గడ్డంతో సిద్దమయ్యారు. మరోవైపు.. రాజమౌళి కూడా ఈ సినిమా లోకేషన్ వెతికే పనిలో పడ్డారు. ఈ మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X