Pawan Kalyan కు మహేష్ బాబు స్పెషల్ బర్త్ డే విషెస్.. ఈసారి ఎలా చెప్పాడంటే..
స్టార్ హీరోలు కలిసి స్నేహంగా ఉంటే అభిమానులు ఎంతగా సంతోషిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అది అందరి హీరోల విషయంలో అది జరగడం లేదు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమల అగ్ర హీరోలుగా కొనసాగుతున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా దాదాపు ఒక తరహా రేంజ్ లో ఉంటారు. ఇక వీరి పుట్టినరోజుల సమయంలో స్పెషల్ గా ఒకరికొకరు విష్ కూడా చేసుకుంటారు. ఇక మరోసారి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసారి ఎలా చెప్పారు అని వివరాల్లోకి వెళితే..

ఊహించని స్టార్ ఇమేజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక మార్కెట్ ఉన్న హీరోలు. కేవలం వారి స్టార్ ఇమేజ్ తోనే సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయగలరు. గత కొన్నేళ్ళల్లో చూసుకుంటే వీరి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతకాంతకు పెరుగుతూనే ఉంది.

అర్జున్ పైరసీ సమయంలో
ఇక మహేష్ బాబు సినిమాలతో బిజీగా ఉండగా మరొకవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తోపాటు సినిమాలో కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కూడా వీరి మధ్యలో ఇప్పటికీ ఒకే తరహా సాన్నిహిత్యం ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. గతంలో మహేష్ బాబు అర్జున్ సినిమా పైరసీ జరిగినప్పుడు పైరసీపై కఠిన చర్యలు తీసుకోవాలి అని అన్నప్పుడు పవన్ కళ్యాణ్ అందరికంటే ముందుగా మహేష్ బాబుకు సపోర్ట్ చేశాడు.

జల్సా సినిమాలో
ఇక మహేష్ బాబు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. జల్సా సినిమాలో మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ అప్పట్లోనే సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు రిలీజ్ సమయంలో కూడా ఇరువురి అభిమానులు కూడా జల్సా సినిమాను మళ్ళీ థియేటర్లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

మహేష్ విషెస్
ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతిసారి మహేష్ బాబు ప్రత్యేకంగా తన బర్త్ డే విషెస్ ను అందిస్తూ ఉన్నాడు. ఇక ఈసారి సోషల్ మీడియాలో కూడా తనదైన శైలిలో ప్రత్యేకంగా మహేష్ బాబు విష్ చేసే ప్రయత్నం చేశారు. హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ అంటూ.. మీకు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, ఆనందం, సంతృప్తి కలగాలని కోరుకుంటున్నాను.. అని మహేష్ ట్వీట్ చేశాడు.

ఒక్క మల్టీస్టారర్ వస్తే..
ఇక మహేష్ బాబు అలా ట్వీట్ చేయగానే సోషల్ మీడియాలో ఆ ట్వీట్ నిమిషాల్లోనే వైరల్ గా మారిపోయింది. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ప్రత్యేకంగా మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక వీరిద్దరి కలయికలో ఒక్క సినిమా వచ్చినా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో పాత రికార్డులు అన్నీ కూడా బ్లాస్ట్ అయిపోతాయని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. భవిష్యత్తులో అది నిజమైతే బాగుండు అని కూడా చాలామంది కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











