ఎన్టీఆర్ కోసం మహష్ బాబు.. రాసి పెట్టుకోండి ఆ రికార్డులు బ్లాస్ట్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అప్పుడప్పుడు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా అభిమానుల్లో కనిపించే ఆనందానికి అవధులు కూడా ఉండవు. ఒక విధంగా గతంలో కంటే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అభిమానుల్లో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు వాళ్ళు వేస్తున్న అడుగులు సరికొత్తగా ఉన్నాయి. మారుతున్న కాలానికి తగ్గట్టుగా మల్టీస్టారర్ సినిమాల స్టైల్ కూడా చాలానే మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు మొదటి సారి తారక్ కోసం ఒక మంచి పని చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అది తప్పని నిరూపిస్తున్న మహేష్

అది తప్పని నిరూపిస్తున్న మహేష్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య వాతావరణం కూడా చాలా మారుతోంది. నిజానికి ఈరోజు అందరూ కూడా చాలా స్నేహంగానే ఉంటున్నారు. పర్సనల్ గా ఒకరికొకరు సహాయం చేసుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఆ విషయాలన్ని ఎక్కువగా బయటకు రాకపోవడంతో కొంతమంది హీరోల మధ్య విభేదాలు ఉన్నాయని కూడా చాలానే రూమర్స్ వచ్చాయి. అప్పుడప్పుడు కొంతమంది హీరోలు అది తప్పని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో మహేష్ బాబు టాప్ లో ఉంటాడు అని చెప్పవచ్చు.

ఇతర హీరోల గురించి పాజిటివ్ గా

ఇతర హీరోల గురించి పాజిటివ్ గా

సాధారణంగా కొంతమంది హీరోలు అయితే మిగతా హీరోల గురించి మాట్లాడడానికి ఇదివరకు సందేహించేవారు. అయితే మహేష్ బాబు మాత్రం ఎప్పుడూ కూడా ఒకరి గురించి మంచిగా మాట్లాడటానికి విముఖత చూపేవారు కాదు. ఎలాంటి హీరో గురించి అడిగినా కూడా చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తూ వచ్చారు. వారితో చాలా మంచి స్నేహం ఉంది అని కూడా చెబుతున్నాడు. ఇతర స్టార్ హీరోలతో ప్రత్యేకంగా పార్టీలు కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

మహేష్ బాబు బాటలోనే..

మహేష్ బాబు బాటలోనే..

మహేష్ బాబు నడుస్తున్న విధానం మిగతా హీరోలకు కూడా బాగా నచ్చింది. ఎలాంటి విభేదాలు లేకుండా అభిమానులు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండాలని అనుకుంటున్నారు. మహేష్ బాబు తరహాలోనే స్నేహంగా ఉండడం బయట కూడా అభిమానులకు తెలియాలి అని అడుగులు వేస్తున్నారు. అయితే మహేష్ బాబు ఇది వరకే భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ ఈవెంట్ ఒక సెన్సేషన్. ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో చూసేసరికి అభిమానులు ఎంతగానో సంతోషించారు.

జూనియర్ ఎన్టీఆర్ - మహేష్ బాబు

జూనియర్ ఎన్టీఆర్ - మహేష్ బాబు

జూనియర్ ఎన్టీఆర్ మాహేష్ బాబుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ట్విట్టర్లో అయితే ఆ సినిమాకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. ఇక మరోసారి పాత రికార్డులన్నీ బ్లాస్ట్ అయ్యేలా మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా కోసం కలవబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యేక అతిథిగా..

ప్రత్యేక అతిథిగా..

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా లాంచ్ వేడుకకు మహేష్ ప్రత్యేక అతిథిగా రాబోతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తాయని చెప్పవచ్చు.

ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం..

ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం..

కేవలం మూవీ లాంచ్ కు మాత్రమే కాకుండా మహేష్ బాబు మీలో ఎవరు కోటీశ్వరులు షో కోసం కూడా రాబోతున్నట్టు ఒక టాక్ అయితే వస్తుంది ఇప్పటికే రామ్ చరణ్ రాజమౌళి కొరటాల శివ వంటి వారు ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా వచ్చిన విషయం తెలిసిందే. ఇక దసరా ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా మహేష్ బాబును ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటి వరకు మహేష్ బాబు ఇలాంటి షోలలో అయితే పాల్గొనలేదు. ప్రస్తుతం సూపర్ స్టార్ సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ బిజీ షెడ్యూల్ లో మహేష్ నిజంగానే తారక్ షో కోసం వస్తారా లేదా అని తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X