పొరపాటు చేయకుండా అభిమానులకు మహేష్ రిక్వెస్ట్.. నా కోసం అలా చేయకండి అంటూ
సూపర్ స్టార్ మహేష్ బాబు సామాజిక విషయాల గురించి ఎక్కువగా మాట్లాడకపోయినా కూడా ఆయన బాధ్యత ఉంటే మాత్రం తప్పకుండా స్పందిస్తారు. ప్రచారాలు హడావుడి లేకుండా సోషల్ సర్వీస్ లో పాల్గొనే మహేష్ ఎంతో మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించాడు. ఇక కరోనా సమయంలో తన వల్ల అభిమానులు పొరపాటు చేయకుండా ముందుగానే రిక్వెస్ట్ చేశారు.

పుట్టినరోజు కావడంతో
ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో అభిమానులు గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో మంచి జోష్ తో కనిపిస్తున్నారు. ఇప్పటికే హ్యాష్ ట్యాగ్ లు సరికొత్తగా ట్రెండ్ అవుతున్నాయి. ఇక ప్రతి ఏడాది మహేష్ బర్త్ డే సందర్భంగా అభిమానులు భారీ సంఖ్యలో సామూహిక వేడుకల్లో పాల్గొంటూ సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు.

ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చిన మహేష్
ఈ సారి కూడా అలాంటి సెలబ్రేషన్స్ చెసుకుంటారేమో అని ముందు జాగ్రత్తగా మహేష్ వారికి ఒక సందేశం ఇచ్చారు. కరోనా వైరస్ రోజురోజుకి ఎక్కువవుతున్న తరుణంలో ఎవరు కూడా ఇలాంటి సమయంలో పార్టీలు అంటూ రిస్క్ చేయవద్దని ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు వారి అభిమానులకు తెలియజేశారు. ఇక మహేష్ కూడా ట్విట్టట్ ద్వారా ఒక వివరణ ఇచ్చారు.
సామూహిక వేడుకలకు దూరంగా ఉండండి
మీరందరు నాకు తోడుగా ఉండడం నా అదృష్టం. నా పుట్టినరోజు, ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుండాలని మీరు చేస్తున్న మంచి పనులకు చాలా సంతోషంగా ఉంది. అందుకు మీ అందరిని కూడా అభినందిస్తున్నాను. ప్రస్తుతం కరోనాతో మనమందరం చేస్తున్న ఈ యుద్ధంలో సురక్షితంగా ఉండడం అనేది అన్నిటికంటే ముఖ్యం. నా పుట్టినరోజున అభిమానులందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమతో మీ మహేష్ అంటూ సూపర్ స్టార్ వివరణ ఇచ్చారు.
Recommended Video

మద్దతు పలికిన అభిమానులు
ముందుజాగ్రత్తగా మహేష్ ఇచ్చిన పిలుపుకు సోషల్ మీడియా ద్వారా అభిమానులు కూడా భారీ స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. ఇక సూపర్ స్టార్ నెక్స్ట్ సర్కారు వారి పాట అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











