SSMB29 ఇండియాలోనే టాప్ బడ్జెట్‌తో మహేశ్, రాజమౌళి మూవీ.. సూపర్‌స్టార్ కోసం జక్కన్న ఖర్చు ఎంతో తెలుసా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జక్కన్న ఎలాంటి సినిమా తీయబోతున్నారా అని అంతా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన తర్వాత నుంచి రాజమౌళి ఎవర్ని డైరెక్ట్ చేయబోతున్నారు, ఎలా చూపించబోతున్నారు అని తెలుసుకునేందుకు తెగ ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా ఈ అప్ డేట్ల కోసం పెద్ద ఎత్తున గూగుల్ లో సెర్చ్ చేశారు.
రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో అని తెలిసినప్పటి నుంచి మరింత ఎగ్జైట్ అయిపోతున్నారు. అయితే ఇంతకాలం మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మధ్యే ఆయన కాస్త ప్రీ అయ్యారు. సినిమా విడుదల అయిన తర్వాత మహేష్ బాబు మరింత ఫ్రీగా ఉండబోతుండగా.. తన నెక్స్ట్ సినిమా చేయాలని భావిస్తున్నారు. మరో మూడు నెలల్లో అంటే మార్చిలో మహేష్ బాబు, జక్కన్నల కాంబో సినిమా పట్టాలెక్కబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

మహేష్ బాబుకు ఇది 29వ సినిమా కాబట్టి దీనికి ఎస్ఎస్ఎంబీ29 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. అయితే ఈ సినిమా ఆఫ్రికన్ జంగిల్ నుంచి యాక్షన్ అడ్వెంచర్ కాబోతుందని తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా.. ఈ సినిమా బడ్జెట్ గురించి పెద్ద ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. తెలుగులో ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసం.. ఎవరూ ఊహించని విధమైన భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారుట. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్, బాహుబలి, బాహుబలి 2 సినిమాల కంటే ఎక్కువ మొత్తం ఈ సినిమా బడ్జెట్ ఉండబోతుందట.
టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన.. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి పార్ట్ 1 సినిమాలు 180 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. అలాగే పార్ట్ 2 ను 250 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాను అయితే మరింత ఎక్కువగా 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరక్కించారు. అయితే మహేష్ బాబుతో తీయబోయే ఈ కొత్త చిత్రానికి మాత్రం ఇంతకు రెండింతల బడ్జెట్ ఉండబోతుంది. మొత్తం 1000 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

పాన్ వరల్డ్ గా తెరకెక్కించబోతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ సాంకేతికి నిపుణులను కూడా భాగస్వామం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రంపై భారీ బజ్ ఏర్పడింది. అసలు పూజా కార్యక్రమాలు కూడా మొదలెట్టకుముందే ఈ రేంజ్ లో హైప్ అందుకుంటున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు కొడుతుందో తెలియాలంటే ఇంకా చాలా కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











