SSMB 28 Mass Strike: గుంటూరు కారం అంటూ మహేష్ మాస్ ర్యాంపేజ్.. డైలాగ్ కూడా అదిరింది!
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న మూడవ చిత్రం టైటిల్ అలాగే ఫస్ట్ టీజర్ మాస్ స్ట్రైక్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇంతకుముందు ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న టైటిల్ ను చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు 4K వెర్షన్ రిలీజ్ తోనే థియేటర్స్ లో టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక కొద్దిసేపటికి యూట్యూబ్ లో కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమా టైటిల్ తో పాటు మహేష్ బాబు ఊర మాస్ ర్యాంపేజ్ లుక్ కూడా ఇందులో హైలెట్ చేశారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే..
బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయ్యేలా: మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో మాస్ ఎలిమెంట్స్ మాత్రం గట్టిగా ఉండాల్సిందే. క్లాస్ మాస్ ఆడియన్స్ తో చేత విజిల్స్ వేయించే మహేష్ బాబుకు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అంటే తప్పకుండా ఈసారి బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అవుతుంది అని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇదివరకే వీరి కలయికలు అతడు సినిమా అలాగే ఖలేజా సినిమాలు వచ్చాయి. అవి అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ మూడోసారి మాత్రం ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

గుంటూరు కారం ఫిక్స్: ఇక ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు అనే విషయంలో చాలాకాలంగా కొన్ని రూమర్స్ అయితే వినిపించాయి. ఇక మొత్తానికి గత రెండు మూడు రోజులుగా వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే గుంటూరు కారం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా గుంటూరు బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు ముందుగానే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు టైటిల్ తో మరింత క్లారిటీ ఇచ్చేశారు.
నెవర్ బిఫోర్ అనేలా మాస్ లుక్:ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర నెవర్ బిఫోర్ అనేలా మాస్ లుక్ లో ఉండబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఇప్పటివరకు విడుదల చేసిన ప్రతి అప్డేట్ కూడా ఫాన్స్ లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఈరోజు ఉదయమే మహేష్ బాబు ఒక పోస్టర్ కూడా విడుదల చేశాడు. గళ్ళ చొక్కా వేసుకొని ఎర్ర తుండుని ధరించి ఒక రేంజ్ లో దర్శనమిచ్చాడు.

త్రిడిలో బీడీ కనపడుతుందా?: ఇక ఇప్పుడు ఫస్ట్ స్ట్రైక్ అంటూ విడుదల చేసిన టీజర్ లో కూడా మహేష్ బాబు అదే లుక్కుతో కనిపించి మాస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించాడు. ఇక త్రివిక్రమ్ మార్క్ కు తగ్గట్టుగా ఒకే ఒక్క టైటిల్ తో మంచి హైప్ పెంచేశారు. "త్రిడిలో బీడీ కనపడుతుందా?" అంటూ మహేష్ బాబు చెప్పిన డైలాగ్ కూడా అద్భుతంగా ఉంది. అలాగే స్టైలిష్ గా నడుచుకుంటూ రావడం, తరువాత జీపు గాల్లోకి లేవడంతో సినిమాలో యాక్షన్ కూడా గట్టిగానే ఉండబోతున్నట్లు ఒక విజువల్ తో తేల్చేశారు. ట్యాగ్ లైన్ కు మాస్ ఘాటుకు తగ్గట్టుగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంట పెట్టేలా ఉందని అనిపిస్తోంది.

సంక్రాంతికి మాస్ ఘాటు పక్కా: మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్ లో మొదటి నుంచి కూడా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాను అసలు ఈ ఏడాది దసరాకు విడుదల చేయాలని అనుకున్నారు. కానీ వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇక మొత్తానికి 2024 సంక్రాంతికి విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాలో పూజా హెగ్డే మహేష్ బాబుకు జోడిగా నటిస్తుండగా శ్రీ లీల మరొక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఇక హారిక హాసిని క్రియేషన్స్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











