Guntur karam: వాళ్లతో ఫైటింగ్‌కు మహేశ్ బాబు రెడీ.. ప్లేస్, డేట్ కూడా ఫిక్స్
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటోన్న భారీ ప్రతిష్టాత్మక చిత్రాల్లో 'గుంటూరు కారం' ఒకటి. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు పన్నెండేళ్ల తర్వాత వీళ్లిద్దరి కలయికలో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. కానీ, ఈ మూవీ షూటింగ్ విషయంలో మాత్రం ఎన్నో రకాల అవాంతరాలు ఎదురు అవుతూనే ఉన్నాయి.
'అతడు', 'ఖలేజా' వంటి క్లాసిక్ చిత్రాల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేస్తున్న 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ గత ఏడాదిలోనే మొదలైంది. ఆ వెంటనే మొదటి షెడ్యూల్ కూడా సక్సెస్‌ఫుల్‌గానే కంప్లీట్ చేసుకున్నారు.

అయితే, తర్వాత అనివార్య కారణాల వల్ల చిత్రీకరణకు కొన్ని ఆటంకాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే షూట్‌ను పున: ప్రారంభించి అనుమానాలకు పుల్‌స్టాప్ పెట్టారు. ఇక, తాజాగా దీనిపై మరింత క్రేజీ సమాచారం ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'గుంటూరు కారం' మూవీ కొత్త షెడ్యూల్ కొత్త షెడ్యూల్‌ను జూలై 7వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారని తాజాగా తెలిసింది. అంతేకాదు, ఇందులో సూపర్ స్టార్ మహేశ్ బాబుపై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారని అంటున్నారు. దీన్ని హైదరాబాద్ శివారు ప్రాంతమైన బీహెచ్ఈఎల్‌లో షూట్ చేయబోతున్నారట. దాదాపు మూడు రోజుల పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తారని తెలిసింది. ఆ తర్వాత కూడా వేరే లొకేషన్‌లో షూట్‌ను కంటిన్యూ చేసే అవకాశం ఉందని తెలిసింది.
ఇదిలా ఉండగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న 'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











