Guntur karam: మహేశ్‌ ఫ్యాన్స్‌కు మరో షాక్.. ఆ అనుమానాలే నిజం అవుతాయా!

టాలీవుడ్‌లో ప్రతి సినిమాకూ తన రేంజ్‌ను, మార్కెట్‌ను గణనీయంగా పెంచుకుంటూ దూసుకుపోతోన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. ఎప్పటికప్పుడు కమర్షియల్ చిత్రాలతో వస్తున్న అతడు.. చాలా హిట్లను కూడా ఖాతాలో వేసుకుంటున్నాడు. అయితే, అతడి గత చిత్రం 'సర్కారు వారి పాట' ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఇప్పుడు భారీ హిట్ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేశ్ బాబు జట్టు కట్టాడు. రెండు క్లాసిక్ చిత్రాల తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న ఈ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.

దాదాపు పన్నెండేళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేస్తున్న చిత్రమే 'గుంటూరు కారం'. ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ గత ఏడాదిలోనే మొదలైంది. ఆ వెంటనే మొదటి షెడ్యూల్ కూడా సక్సెస్‌ఫుల్‌గానే కంప్లీట్ చేసుకున్నారు. అయితే, తర్వాత మహేశ్ బాబు ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకోవడం.. అతడు కరోనా వ్యాధి బారిన పడడం వంటి కారణాల వల్ల చిత్రీకరణకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. తర్వాత షూట్ జరిగినా మళ్లీ వాయిదా పడింది. తాజాగా దీనిపై ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

Mahesh Babu Starrer Guntur karam Movie New Schedule From July

'గుంటూరు కారం' మూవీకి కొత్త షెడ్యూల్ గత సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, కొందరు సీనియర్ అండ్ టాప్ ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో దీన్ని ఆపేశారు. అయితే, మరికొద్ది రోజుల్లోనే ఈ షెడ్యూల్ ప్రారంభం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా దీన్ని జూలై మొదటి వారానికి వాయిదా వేసినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఇప్పటికే ఈ సినిమా సంక్రాంతి నుంచి సమ్మర్‌కు వాయిదా పడే ఛాన్స్ ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పుడిలా షూట్ వాయిదా పడుతుంటే అదే నిజం అయ్యేలా ఉందని చెప్పొచ్చు.

ఇక, త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న 'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X