Mahesh Babu: మహేష్ బాబు సినిమాకు షాకింగ్ టీఆర్పీ.. థియేటర్లలో బ్లాక్ బస్టర్, మరి టీవీల్లో?
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చి రీసెంట్ సూపర్ హిట్ సినిమానే గుంటూరు కారం. అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చి అందరినీ అలరించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీగానే వసూళ్లు రాబట్టుకుంది. కానీ ఈ సినిమాలో గురూజీ మార్క్ కనిపించలేదని.. మహేష్ బాబును ఇంకాస్త బాగా చూపించి ఉండొచ్చని చాలా మంది రీవ్యూలు ఇచ్చారు. అయితే తాజాగా ఈ సినిమా టీవీల్లోకి వచ్చింది. థియేటర్ల వద్ద సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం టీవీల్లో ఏ రేంజ్ లో హిట్ కొట్టింది.. ఎంత టీఆర్పీ రాబట్టుకుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమాను హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్. రాధా కృష్ణ నిర్మించారు. ఫుల్ లెంత్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు, శ్రీలీల హీరోహీరోయిన్లుగా చేయగా.. జగపతి బాబు, రమ్యకృష్ణ, మీనాక్షి చౌదరి, ప్రకాష్ రాజ్, జయరామ్, ఈశ్వరీ రావు, రావు రమేష్, మురళీ శర్మ, సునీల్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో కనిపించారు.

ఈ చిత్రాన్ని థమన్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రఫర్ గా పి.ఎస్.వినోద్, ఎడిటర్ గా నవీన్ నూలి పని చేశారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ విడుదల అయిందీ సినిమా. అయితే 150 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రానికి రూ.250 కోట్లు వసూళ్లు వచ్చాయి. నెల తిరక్కముందే ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమా తాజాగా టీవీల్లో ప్రాసారం అయింది. ఉగాది సందర్భంగా జెమిని టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శితం అయింది.
అయితే టీవీల్లో ఎవరూ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించి అందరికీ షాక్ ఇచ్చిందీ చిత్రం. థియేటర్లు, ఓటీటీల్లోనే చాలా మంది ఈ సినిమాను చూడగా.. టీవీల్లో కూడా అలాగే చూశారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఏ సినిమా రాబట్టుకోని టీఆర్పీని సొంతం చేసుకుని రచ్చ లేపింది. ముఖ్యంగా 9.23 టీఆర్పీ రేటింగ్ సాదించి మరోసారి సక్సెస్ కొట్టింది. ఇది మాత్రమే కాకుండా జెమిలో వచ్చి మంచి టీఆర్పీని సొంతం చేసుకున్న మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి.

వాల్తేరు వీరయ్య 5.14, హాయ్ నాన్న 4.45, దసరా 4.49, గాడ్ ఫాదర్ 7.69, హిట్ 2 3.69, జైలర్ 6.30, లియో ది ఫిల్మ్ 3.00, సర్ 5.89 టీఆర్పీని రాబట్టుకున్నాయి. ఇందులో ఏ ఒక్క చిత్రం కూడా 9 శాతం రాబట్టుకోలేదు. కానీ గుంటూరు కారం మాత్రం 9.23 రాబట్టుకుని టాప్ ట్రెండింగ్ లో నిలిచింది.


Click it and Unblock the Notifications











