మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బర్త్‌డే రోజే ఆ సినిమా రిలీజ్
కొంత కాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో పాత మూవీల రీ రిలీజ్‌ల సందడి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా రెండు మూడేళ్లుగా వీటి సంఖ్య మరింతగా పెరిగిపోయింది. కొన్ని ప్రత్యేకమైన రోజులను పురస్కరించుకుని గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేస్తున్నారు. అలా వచ్చిన వాటికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో ఈ తరహాలో మరిన్ని చిత్రాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన క్రేజీ సినిమా రీ రిలీజ్ కాబోతుంది.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'పోకిరి', 'బిజినెస్‌మ్యాన్' సినిమాలను రీ రిలీజ్ చేసిన అభిమానులు.. ఇప్పుడు అతడి కెరీర్‌లోనే గొప్ప చిత్రాలలో ఒకటిగా నిలిచిన 'మురారి' మూవీని కూడా మరోసారి తీసుకు వస్తున్నారు. 'గుంటూరు కారం' తర్వాత రాజమౌళి సినిమాతో చాలా గ్యాప్ రాబోతున్న నేపథ్యంలో ఆగస్టు 9వ తేదీన ఈ క్రేజీ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. అతడి పుట్టినరోజు సందర్భంగా దీన్ని ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు - కృష్ణ వంశీ కాంబినేషన్‌లో వచ్చిన 'మురారి' మూవీని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. అంతేకాదు, దీన్ని ఏకంగా 300లకు పైగా స్క్రీన్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఈ సినిమా అప్‌డేటెడ్ 4K ప్రింట్ వర్క్ కూడా దాదాపుగా పూర్తి అయింది. ఇక, ఈ సినిమా ట్రైలర్‌ను మరికొద్ది రోజుల్లోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇక, ఈ సినిమా విడుదలను పండుగలా జరుపుకోవాలని ఫ్యాన్స్ ఏర్పాట్లను చేస్తోన్నారు. ఇక, ఈ చిత్రాన్ని దాదాపు 18 నిమిషాలు ట్రిమ్ చేసినట్లు కూడా తెలిసింది.
ఇదిలా ఉండగా.. దేవుడి శాపం నేపథ్యంతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మురారి' సినిమాను రామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్ దేవీ ప్రసాద్, రామలింగేశ్వర రావు, గోపీ నందిగంలు నిర్మించారు. ఇందులో సోనాలి బింద్రే హీరోయిన్‌గా నటించగా.. లక్ష్మి, సుకుమారి, కైకాల సత్యనారాయణ, చంద్రమోహన్, గొల్లపూడి మారుతి రావు, రవి బాబు, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతాన్ని సమకూర్చారు.


Click it and Unblock the Notifications











