మహేష్ బాబు న్యూ స్టైలిష్ లుక్.. నలభై అంటే నమ్ముతారా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేకప్ వేసుకొని చాలా కాలమవుతోంది. ఇక లాక్ డౌన్ ముగిసిన వెంటనే కొత్త సినిమా షూటింగ్ పనులను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ పరశురామ్ దర్శకత్వంలో మహేష్ తన 27వ సినిమాను చేయబోతున్నాడు. అయితే ఆ సినిమాకు సంబంధించిన లుక్ కోసం సూపర్ స్టార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది.

లాక్ డౌన్ చర్చలు..
మహేష్ బాబు చాలా రోజుల తరువాత షూటింగ్ గ్యాప్ ఇచ్చి తన ఇంట్లోనే ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఎవరిని డైరెక్ట్ గా కలవకుండా లైవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నెక్స్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు జరిపాడు. గీత గోవిందం దర్శకుడు ఫైనల్ స్క్రిప్ట్ తో సిద్ధమయ్యాడు. లాక్ డౌన్ తరువాత మహేష్ సిద్ధమైతే షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.

న్యూ లుక్ వైరల్..
మహేష్ చాలా రోజుల తరువాత ఒక కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో తన డాగ్స్ తో సరదగా కాలక్షేపం చేస్తున్నట్లు ఒక వీడియోను పోస్ట్ చేసిన మహేష్ అభిమానులకు సరికొత్త కిక్కిచ్చాడు. నిజంగా మహేష్ తన వయసుతో మోసం చేస్తున్నాడనే చెప్పాలి. హెయిర్ స్టైల్ పూర్తిగా మార్చేసిన సూపర్ స్టార్ పాతికేళ్ల వెనక్కి వెళ్లినట్లు అనిపిస్తోంది.

నలభై అంటే నమ్ముతారా?
మహేష్ బాబు వయసు 44. సాధారణంగా మహేష్ బయట ఎక్కడ కనిపించినా యంగ్ గానే కనిపిస్తాడు. ఇక ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే నలభై ఏళ్ల వయసంటే నమ్మబుద్ది కాదు. 20ఏళ్ళ కుర్రాడిలా కనిపిస్తున్న ప్రిన్స్ ఎలాంటి కేర్ తీసుకుంటాడో అని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ తన పెట్ డాగ్స్ తో అలా సరదాగా కనిపించడం బావుందని అభిమానుకు ఆ వీడియోను వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
Recommended Video

ఆ సినిమా కోసమే..
పరశురామ్ తెరకెక్కించనున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథలో మహేష్ ప్లే బాయ్ వేషాలు వేస్తాడట. రొమాంటిక్ డోస్ కుడా గట్టిగానే ఉంటుందని టాక్ వస్తోంది. ఆ సినిమా కోసం లుక్ కూడా సెట్ చేసుకున్న సూపర్ స్టార్ షెడ్యూల్ సెట్టయితే రంగంలోకి దిగాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో బిజీ అయ్యాడు. మరి ఆ సినిమా అభిమానుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











