విజయశాంతి పుట్టినరోజున మహేష్ స్వీట్ నోట్.. ఆసక్తికరంగా స్పందించిన రాములమ్మ!!
ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి ఈ రోజు 55వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దీంతో ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. 1950లో తమిళ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె అదే ఏడాది కిలాడీ కృష్ణుడు అనే సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది..
తెలుగులో స్టార్ హీరోలతో పోటాపోటీగా నటించిన ఆమె లేడీ సెంట్రిక్ సినిమాలు చాలా చేసింది. అయితే కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో బ్రేక్ తీసుకుని రాజకీయాల్లోకి వెళ్ళిన ఆమె అనేక పదవులు కూడా నిర్వహించింది. అయితే ఆమెకు రాజకీయాలు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి.

ఇక ఎట్టకేలకు ఆమెను గత ఏడాది రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు అనే సినిమాతో రీ ఎంట్రీ ఇప్పించాడు అనిల్ రావిపూడి ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు విజయశాంతి చేసిన పాత్ర కూడా ప్రేక్షకులు అందరినీ మెప్పించింది. అయితే ఈ రోజు విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా సరిలేరు నీకెవ్వరులో ఆమెతో కలిసి నటించిన మహేష్ బాబు ఒక స్వీట్ నోట్ తో విష్ చేశారు.

హ్యాపీ బర్త్డే విజయశాంతి గారు మీరు మరింత ఆనందంగా, మన:శాంతితో మంచి ఆరోగ్యంతో కలకాలం జీవించాలని కోరుకుంటున్నాను అని మహేష్ ట్వీట్ చేశారు. దానికి ఆమె ఆసక్తికరంగా స్పందిస్తూ థాంక్యూ సూపర్ స్టార్ మహేష్ గారు అంటూ ట్వీట్ చేసింది. ఇక ప్రస్తుతానికి విజయశాంతి ఎలాంటి సినిమాల్లో నటించడం లేదు.. కానీ పొలిటికల్ గా ఆమె యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే బీజేపీలో ఆమె కీలక పదవి కూడా పొందారు. వచ్చే ఎన్నికల్లో ఆమె నేరుగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











