Mahesh Babu: 'గుంటూరు కారం'కు మళ్లీ బ్రేక్.. గౌతమ్ కోసం మహేశ్ చేసిన పనికి ఫ్యాన్స్ నిరాశ!

స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి సూపర్ స్టార్ గా ఎదిగాడు మహేశ్ బాబు. చివరిగా సర్కారు వారి పాట మూవీతో హిట్ అందుకున్న మహేశ్ తర్వాత ఇంకో సినిమా రాలేదు. కాబట్టి మహేశ్ బాబు అభిమానులు ఆయన సినిమా కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు.

ఇక స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, దర్శకదిగ్గజం రాజమౌళితో మహేశ్ సినిమాలు చేయడంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అయ్యారు. త్వరలో త్రివిక్రమ్-మహేశ్ కాంబినేషన్ లో గుంటూరు కారం సినిమా వస్తుందనుకుని సంబరపడిన అభిమానులకు నిత్యం నిరాశే ఎదురవుతోంది. తాజాగా మహేశ్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.

Mahesh Babu Taking Break Again To Guntur Karam For Son Gautham

ఆ సినిమాలతో: సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టాడు మహేశ్ బాబు. హ్యాండ్సమ్ అండ్ మాస్ హీరోగా అతి తక్కువ కాలంలోనే విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నాడు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ చాలా కాలంగా సత్తా చాటుతున్నాడు. ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు వంటి సినిమాలతో అగ్ర హీరో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు.

Mahesh Babu Taking Break Again To Guntur Karam For Son Gautham

క్రేజీ ప్రాజెక్ట్స్: గతేడాది 'సర్కారు వారి పాట' సినిమాతో అలరించిన మహేశ్ బాబు ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు అడ్వెంచర్ సినిమా SSMB29 ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్నాడు. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో గుంటూరు కారం ఒకటి.

Mahesh Babu Taking Break Again To Guntur Karam For Son Gautham

హీరోయిన్స్: హారిక హాసినీ క్రియేషన్స్, సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక విషయంపై రచ్చ జరుగుతూనే ఉంటుంది. మొదట్లో హీరోయిన్ గా అనుకున్న పూజా హెగ్డేను తప్పించడంతో హాట్ టాపిక్ అయింది.

Mahesh Babu Taking Break Again To Guntur Karam For Son Gautham

మళ్లీ విదేశాలకు: పూజా హెగ్డేతో స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారని మరో టాక్ రావడం కూడా కాస్తా ఆసక్తిగా మారింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తీసేసినట్లు వార్తలురాగా వాటిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇవే కాకుండా మహేశ్ బాబు తరచుగా విదేశాలకు వెళ్లడంతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు తాజాగా మరోసారి మహేశ్ బాబు విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం.

Mahesh Babu Taking Break Again To Guntur Karam For Son Gautham

కొడుకు కోసం: గుంటూరు కారం కొత్త షెడ్యూల్ ను ఈనెల 19తో కంప్లీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కానీ, మహేశ్ కుమారుడు గౌతమ్ లండన్ లో చదువుతున్న కారణంగా కొడుకుతో కలిసి మహేశ్ లండన్ వెళ్లనున్నారట. అందుకే చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం. మళ్లీ ఒక వారంలో హైదారబాద్ కు మహేశ్ తిరిగి వస్తారని టాక్.

Mahesh Babu Taking Break Again To Guntur Karam For Son Gautham

తిరిగి వచ్చాకే: మహేశ్ హైదరాబాద్ కు తిరిగి వచ్చిన తర్వాత గుంటూరు కారం కొత్త షెడ్యూల్ లో పాల్గొంటారని తెలుస్తోంది. సూపర్ స్టార్ వచ్చేవరకు అతను లేని కొన్ని పోర్షన్స్ ను డైరెక్టర్ తివిక్రమ్ పూర్తి చేయనున్నారని సమాచారం. ఇలా మహేశ్ తరచూ బ్రేక్స్ ఇవ్వడంతో ఫ్యాన్స్ కాస్తా నిరాశపడినట్లు టాక్. ఎందుకుంటే షూటింగ్ కు బ్రేక్ రావడంతో సినిమా పూర్తి ఎప్పుడు అవుతుంది?, ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఆలోచనలో పడిపోతున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X